11 ఏళ్ల తర్వాత తప్పుకోనున్న ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సీఈఓ

Flipkart Leadership Change: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 11 ఏళ్లకు పైగా సంస్థతో కొనసాగిన ఆయన ప్రయాణానికి ముగింపు పలకనున్నారు. బుధవారం (నవంబర్ 25) ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది.

Flipkart CEO Kalyan Krishnamurthy Resignation
Flipkart CEO Kalyan Krishnamurthy Resignation
  • 11 ఏళ్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవి నుంచి కల్యాణ్ కృష్ణమూర్తి నిష్క్రమణ.
  • కొత్త సీఈఓ వచ్చే వరకు బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక బాధ్యతలు.

Flipkart Leadership Change: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 11 ఏళ్లకు పైగా సంస్థతో కొనసాగిన ఆయన ప్రయాణానికి ముగింపు పలకనున్నారు. బుధవారం (నవంబర్ 25) ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది.

తాత్కాలిక బాధ్యతలు ఎవరికి?

కల్యాణ్ కృష్ణమూర్తి నిష్క్రమణ నేపథ్యంలో కొత్త సీఈఓ నియామకంపై సంస్థ దృష్టి పెట్టింది. రానున్న కొన్ని వారాల్లో కొత్త సీఈఓ పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) బాలాజీ త్యాగరాజన్ తాత్కాలికంగా సంస్థ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. కంపెనీ బోర్డు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించనుంది. 

ఐదు రెట్లకు పైగా పెరిగిన వ్యాపారం

కల్యాణ్ కృష్ణమూర్తి నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. ఆయన హయాంలో సంస్థ వ్యాపారం ఐదు రెట్లకు పైగా వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ప్రతి ఏడాది నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడంతో పాటు విక్రేతలకు కూడా కొత్త అవకాశాలు కల్పించడంలో సంస్థ ముందడుగు వేసింది. 

వాల్‌మార్ట్ కొనుగోలు సమయంలోనూ కీలక పాత్ర

ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంలో కల్యాణ్ కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారు. 2017లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2018లో వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సమయంలోనూ నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. అనంతరం కంపెనీ విస్తరణ, వ్యాపార నిర్వహణ, భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో ఐపీఓకు తీసుకురావాలనే సన్నాహాల్లో భాగమయ్యారు. 

కల్యాణ్ కృష్ణమూర్తికి వాల్‌మార్ట్ ప్రశంసలు

కల్యాణ్ కృష్ణమూర్తి సేవలను వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ ప్రశంసించారు. ఆయన నాయకత్వం, సంస్థలో ఏర్పాటు చేసిన పాలనా ప్రమాణాలు, అందించిన సేవలు ఫ్లిప్‌కార్ట్ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. మరోవైపు సంస్థ ప్రయాణంలో భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని, నైతిక విలువలు, సమగ్రత, ఉన్నత ప్రమాణాలే ఫ్లిప్‌కార్ట్ వృద్ధికి పునాదులని కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 

ఇక కొత్త సీఈఓ నియామకం, భవిష్యత్తులో ఐపీఓ ప్రణాళికలపై ఫ్లిప్‌కార్ట్ తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయి.

Tags

Be the first to react

Latest