Expensive Penthouse: ముంబై రికార్డులను తిరగరాసిన గుర్గావ్... రూ. 271 కోట్లతో భారత్‌లోనే కాస్ట్లీ ఇల్లు!

Expensive Penthouse: హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక 'డిఎల్ఎఫ్ ది దాలియాస్' (DLF The Dahlias) అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఒక పెంట్ హౌస్ ఏకంగా రూ. 271 కోట్లకు విక్రయించబడింది.

లగ్జరీ పెంట్ హౌస్
లగ్జరీ పెంట్ హౌస్

దేశంలోనే అతిపెద్ద సింగిల్ యూనిట్ రెసిడెన్షియల్ డీల్...

రూ. 271 కోట్ల పెంట్ హౌస్‌లోని ప్రత్యేకతలు ఇవే...

దేశంలోనే మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ డీల్...

Expensive Penthouse: భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ నమోదైంది. హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక 'డిఎల్ఎఫ్ ది దాలియాస్' (DLF The Dahlias) అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఒక పెంట్ హౌస్ ఏకంగా రూ. 271 కోట్లకు విక్రయించబడింది. ప్రముఖ వ్యాపారవేత్త మానవ్ సర్దానా ఈ ఖరీదైన పెంట్ హౌస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా దేశంలోనే అత్యధిక ధర కలిగిన సింగిల్-యూనిట్ నివాసాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు.

ఎవరీ మానవ్ సర్దానా?: మానవ్ సర్దానా ప్రముఖ వాహన విడిభాగాల తయారీ సంస్థ 'ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్' మాజీ ప్రమోటర్లలో ఒకరు. గతంలో ఈ సంస్థను గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్బర్గ్ పింకస్' చేజిక్కించుకుంది. ఆటోమోటివ్ ఫ్లూయిడ్ ట్రాన్స్‌మిషన్ ఉత్పత్తుల తయారీలో గుర్తింపు పొందిన ఈ గ్రూప్‌కు చెందిన పలు సంస్థల్లో మానవ్ సర్దానా డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ బిజినెస్ డీల్ ద్వారా లభించిన మూలధనంతో ఆయన ఈ అల్ట్రా లగ్జరీ ఆస్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

పెంట్ హౌస్ ప్రత్యేకతలు మరియు కొలతలు: ఈ లగ్జరీ పెంట్ హౌస్ దాదాపు 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా మరియు 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. కొనుగోలు చేసిన ధర ప్రాతిపదికన చూస్తే, కార్పెట్ ఏరియా ప్రకారం చదరపు అడుగుకు దాదాపు రూ. 2.6 లక్షలు కాగా, సూపర్ ఏరియాపై చదరపు అడుగుకు రూ. 1.58 లక్షలుగా లెక్కతేలింది. ఇప్పటివరకు ముంబై నగరంలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాలే అత్యంత ఖరీదైన ఆస్తులకు నిలయంగా ఉండగా, ఇప్పుడు గుర్గావ్‌లోని ఈ డీల్ ముంబై రికార్డులను కూడా అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

లగ్జరీ హౌసింగ్ హబ్‌గా గుర్గావ్: డిఎల్ఎఫ్ సంస్థ రూపొందించిన 'ది దాలియాస్' ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నివాస ప్రాంతంగా మారింది. 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, 8 టవర్లు మరియు 29 అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌లో కేవలం 420 అత్యంత విలాసవంతమైన నివాసాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 3.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో క్లబ్‌హౌస్ కూడా ఉంది. ఇప్పటికే ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా, క్రికెటర్ శిఖర్ ధావన్ వంటి ప్రముఖులు ఇందులో నివాసాలు కొనుగోలు చేశారు. మానవ్ సర్దానా చేసిన ఈ రూ. 271 కోట్ల కొనుగోలు గుర్గావ్‌ను దేశీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ రాజధానిగా నిలబెట్టింది.

Tags

Be the first to react

Latest