Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.? Oil Crisis: ఇరాన్ వార్ ఎఫెక్ట్: ఆయిల్ లేకపోయినా మనకేం కాదు.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! Chicken Shops: ఏప్రిల్ 1 నుండి చికెన్ షాపులు బంద్! కారణం ఏంటంటే... Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.! April 1 Changes: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మార్పులివే! Global Pharmacy: విదేశీ మందుల దోపిడీకి భారత్ బ్రేక్.. గ్లోబల్ ఫార్మసీగా మన జైత్రయాత్ర! Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.! Indian Stock Market: బ్లాక్ మండే.. మార్కెట్ విలవిల.. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఇన్వెస్టర్ల కొంపముంచిన పతనం. New RBI Rules: సామాన్యులకు భారీ ఊరట! ఏప్రిల్ 1 నుండి అమల్లోకి కొత్త ఆర్‌బీఐ రూల్స్! iPhone price hike India: ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! MRP మారదు.. కానీ.? Oil Crisis: ఇరాన్ వార్ ఎఫెక్ట్: ఆయిల్ లేకపోయినా మనకేం కాదు.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! Chicken Shops: ఏప్రిల్ 1 నుండి చికెన్ షాపులు బంద్! కారణం ఏంటంటే... Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.! April 1 Changes: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మార్పులివే! Global Pharmacy: విదేశీ మందుల దోపిడీకి భారత్ బ్రేక్.. గ్లోబల్ ఫార్మసీగా మన జైత్రయాత్ర!

Rupee vs Dollar: క్రూడాయిల్ సెగ.. రూపాయి విలవిల.. అంతర్జాతీయ అనిశ్చితితో కుదేలవుతున్న భారత కరెన్సీ.!

Rupee vs Dollar: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి భారత కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

Published : 2026-03-30 19:14:00
  • డాలర్ ఇండెక్స్ జోరు.. రూపాయి బేజారు: అంతర్జాతీయ మార్కెట్లో బలపడుతున్న అమెరికన్ కరెన్సీ..
     
  • Business: "లాభాలతో మొదలై.. నష్టాలతో ముగిసి": 130 పైసల రికవరీని నిలబెట్టుకోలేకపోయిన రూపాయి..

Rupee vs Dollar: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి భారత కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఒక దశలో డాలర్‌తో రూపాయి విలువ 95.14 వద్దకు చేరుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. రూపాయి చరిత్రలో 95 స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి గత వారం కనిష్ఠాల నుంచి కోలుకున్న రూపాయి, ఈరోజు ఉదయం సెషన్ ప్రారంభంలో 130 పైసలు లాభపడి 93.59 వద్ద ట్రేడింగ్‌ను ఆశాజనకంగానే ప్రారంభించింది. అయితే, రోజు ముగిసే సమయానికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో తిరిగి భారీ నష్టాల్లోకి జారుకుని చారిత్రాత్మక కనిష్ఠానికి పరిమితమైంది.

రూపాయి ఇంతటి బలహీనతను మూటగట్టుకోవడానికి అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 109 డాలర్ల మార్కును దాటడం భారత ఆర్థిక వ్యవస్థపై భారంగా మారింది. చమురు దిగుమతుల కోసం డాలర్లకు గిరాకీ పెరగడం, అదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయి పతనానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం కూడా రూపాయిని ఒత్తిడిలోకి నెట్టింది.

గణాంకాల ప్రకారం, ఈ ఒక్క నెలలోనే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి సుమారు 11.5 బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఒక్కరోజే విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ.850 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాలు, అంతర్జాతీయంగా డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ వెరసి రూపాయిని కోలుకోలేని స్థితికి తీసుకెళ్లాయి. భవిష్యత్తులో రూపాయి మరింత పతనం కాకుండా ఉండేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) జోక్యం చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Spotlight

Read More →