ఐఫోన్ యూజర్లకు పండగే! ట్యాప్ చేస్తే పేమెంట్.. భారత్‌లో యాపిల్ పే దూకుడు!
Apple Pay Launches in India: ఐఫోన్ యూజర్లకు యాపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు భారత్‌లో అందుబాటులో లేని తన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సేవ యాపిల్ పేను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు తమ అనుకూల కార్డులను యాపిల్ పేలో జోడించి, ట్యాప్ చేసి చెల్లింపులు చేసే అవకాశం లభించింది.
- ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ యూజర్లకు కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సదుపాయం.
- ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో.
Apple Pay Launches in India: ఐఫోన్ యూజర్లకు యాపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు భారత్‌లో అందుబాటులో లేని తన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సేవ యాపిల్ పేను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు తమ అనుకూల కార్డులను యాపిల్ పేలో జోడించి, ట్యాప్ చేసి చెల్లింపులు చేసే అవకాశం లభించింది.
అయితే తొలిదశలో ఈ సేవలు యాక్సిస్ బ్యాంక్ జారీ చేసే వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే పరిమితం కానున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకుల కార్డులను యాపిల్ పేలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు ఉంటాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పిన్.. ఓటీపీ అవసరం లేకుండానే చెల్లింపు
యాపిల్ పేలో ప్రధాన ఆకర్షణ వేగవంతమైన, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులే. పేమెంట్ సమయంలో ప్రతిసారీ కార్డు పిన్ లేదా ఓటీపీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఫోన్‌లో ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ద్వారా వినియోగదారుడి గుర్తింపును నిర్ధారించిన తర్వాత పేమెంట్ టెర్మినల్ దగ్గర డివైజ్‌ను ఉంచితే చెల్లింపు పూర్తవుతుంది.
దీంతో ఫిజికల్ కార్డు బయటకు తీయకుండానే, కార్డు వివరాలను టైప్ చేయకుండానే పేమెంట్ చేసే వెసులుబాటు లభిస్తుంది.
కార్డు నంబర్.. వ్యాపారికి తెలియదు
యాపిల్ పేలో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. వినియోగదారుడి అసలు కార్డు నంబర్‌ను డివైజ్‌లో లేదా యాపిల్ సర్వర్లలో నిల్వ చేయడం, వ్యాపారులతో పంచుకోవడం ఉండదని పేర్కొంది.
దానికి బదులుగా ఎన్‌క్రిప్ట్ చేసిన ప్రత్యేక డివైజ్ అకౌంట్ నంబర్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తారు. దీంతో కార్డు వివరాలను నేరుగా షేర్ చేయకుండా చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
భారత్ మార్కెట్‌పై యాపిల్ దృష్టి
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యాపిల్ పే ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువత పెద్ద సంఖ్యలో ఉన్న భారత్‌లో నగదు రహిత చెల్లింపులకు ఆదరణ పెరుగుతోందని యాపిల్ పే, వాలెట్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ జెన్నిఫర్ బెయిలీ తెలిపారు. ప్రైవసీ, సెక్యూరిటీకి వినియోగదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో భారత్‌లో యాపిల్ పేను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
యూపీఐకి కూడా కనెక్ట్ అవుతుందా?
ప్రస్తుతం యాపిల్ పే క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపులకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో యూపీఐతో అనుసంధానం చేసే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికైతే ఐఫోన్ యూజర్లు యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్స్‌ను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
భారత్‌లో యాపిల్ పే అడుగుపెట్టడంతో ఐఫోన్ యూజర్లకు డిజిటల్ చెల్లింపుల్లో మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లైంది. అయితే సేవల పరిధి ప్రస్తుతం కొన్ని కార్డులకే పరిమితం కావడంతో, ఇతర బ్యాంకుల కార్డులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Tags
Be the first to react