Nara Brahmani: 'ఫార్చ్యూన్ ఇండియా' అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి.. రైతులకు అంకితం చేసిన అరుదైన గౌరవం!
Nara Brahmani: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
దేశంలోని టాప్-100 ప్రభావవంతమైన మహిళల్లో చోటు దక్కించుకున్న నారా బ్రాహ్మణి..
ఫార్చ్యూన్ ఇండియా అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి.. రైతులకు అంకితం చేసిన గౌరవం..
న్యూఢిల్లీ: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో నారా బ్రాహ్మణి అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ అభివృద్ధి ప్రస్థానం, సంస్థ ఎదుగుదలతో పాటు రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. వ్యవసాయ రంగం బలోపేతం కావాలంటే రైతుల ఆదాయం పెరగడం అత్యంత ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
అవార్డు అందుకున్న అనంతరం నారా బ్రాహ్మణి స్పందిస్తూ, ఈ గౌరవం తన వ్యక్తిగత విజయంగా కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, సంస్థ ఉద్యోగులకు, ముఖ్యంగా సంస్థతో అనుబంధంగా ఉన్న రైతులందరికీ అంకితమని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్ విజయ ప్రస్థానంలో రైతుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారికి స్థిరమైన ఆదాయం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె చెప్పారు.
మరోవైపు భార్య సాధించిన ఈ అరుదైన విజయంపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి చోటు సంపాదించడం గర్వకారణమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తన సందేశంలో బ్రాహ్మణి ఇలాంటి ప్రతిభను కొనసాగిస్తూ, నాయకత్వ లక్షణాలతో అన్ని అవరోధాలను అధిగమించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గుర్తింపు మహిళా నాయకత్వానికి, పారిశ్రామిక రంగంలో మహిళల పెరుగుతున్న పాత్రకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
నారా బ్రాహ్మణికి లభించిన ఈ గౌరవం హెరిటేజ్ ఫుడ్స్ సంస్థతో పాటు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది రైతులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags
Be the first to react