Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్ కొరియా కార్యాలయం ఏర్పాటు.. కమిషనర్కు మంత్రి లోకేష్ ఆహ్వానం!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరో కీలక సమావేశం నిర్వహించారు. ఇన్వెస్ట్ కొరియా కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యుంగ్తో సియోల్లో భేటీ అయిన మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కొరియా పెట్టుబడుల కోసం అమరావతి లేదా విశాఖలో కోట్రా కార్యాలయం ప్రతిపాదన..
ప్రత్యేక కొరియా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు లోకేష్ ప్రతిపాదన..
సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరో కీలక సమావేశం నిర్వహించారు. ఇన్వెస్ట్ కొరియా (KOTRA/Invest Korea) కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యుంగ్తో సియోల్లో భేటీ అయిన మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక కోట్రా/ఇన్వెస్ట్ కొరియా కార్యాలయం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొరియా పెట్టుబడులు మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. ఇది మెట్రో నగరాల వెలుపల దక్షిణ భారతదేశంలో ఏర్పడే తొలి ఉప-జాతీయ కోట్రా కార్యాలయంగా నిలుస్తుందని చెప్పారు.
మొదట ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (APEDB)లో కోట్రా డెస్క్గా ప్రారంభించి, తర్వాత దానిని పూర్తి స్థాయి కార్యాలయంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అలాగే సియోల్లోని కోట్రా/ఇన్వెస్ట్ కొరియాలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ డెస్క్ ఏర్పాటు చేస్తే ఇరు సంస్థల మధ్య సమన్వయం మరింత బలపడుతుందని వివరించారు.
కొరియా పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక కొరియా ఇండస్ట్రియల్ పార్క్ లేదా కొరియా క్లస్టర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. దీనివల్ల కొరియా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
అలాగే శ్రీసిటీ, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలోని కియా ఆటోమొబైల్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను కొరియా వ్యాపార ప్రతినిధి బృందం సందర్శించేలా నాయకత్వం వహించాలని డాక్టర్ కిమ్ టే హ్యుంగ్ను మంత్రి కోరారు.
ఈ ఏడాది నవంబర్ 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న CII పార్ట్నర్షిప్ సమ్మిట్–2026లో కొరియా కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్–దక్షిణ కొరియా మధ్య పారిశ్రామిక, పెట్టుబడి సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
Tags
Be the first to react
