Chandrababu: చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్చాట్.. అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు!
Chandrababu: చిత్తూరు జిల్లాలో మీడియాతో జరిగిన చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
క్వాంటం, సెమీ కండక్టర్ రంగాల్లో పెట్టుబడులు తెస్తున్నాం – సీఎం చంద్రబాబు..
కుప్పాన్ని ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం – చంద్రబాబు వ్యాఖ్యలు..
చిత్తూరు జిల్లాలో మీడియాతో జరిగిన చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కుప్పం ప్రాంతం ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతోందని సీఎం తెలిపారు. అక్కడ ఇప్పటివరకు ఎన్నడూ రానన్ని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీ పెంచుతున్నామని, అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూడబోతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
రాష్ట్రానికి క్వాంటం టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
ఇంధన రంగంలోనూ అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అలాగే ఆర్సెలార్ మిట్టల్, జేఎస్డబ్ల్యూ వంటి పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని ఆయన వివరించారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే, వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వాటిని వివాదాల్లోకి నెట్టారని ఆయన అన్నారు.
ఒక వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు, ఖనిజ సంపదను బ్లాక్ చేశారని విమర్శించారు. పరిశ్రమలను తరిమేయడం, పెట్టుబడులు రాకుండా చేయడం వైసీపీ లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags
Be the first to react