Visakhapatnam: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారీ గాలింపు చర్యలు.. రంగంలోకి కోస్టుగార్డు, నేవీ!
Visakhapatnam: విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి, కోస్టుగార్డు, నేవీ నౌకలతో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసి గాలింపు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ మత్స్యకారుల గల్లంతు – నేవీ, కోస్టుగార్డు రంగంలోకి..
గల్లంతైన బోటు కోసం సమన్వయ గాలింపు – సీఎం చంద్రబాబు ఆదేశాలు..
విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి, కోస్టుగార్డు, నేవీ నౌకలతో పాటు అన్ని విభాగాలను సమన్వయం చేసి గాలింపు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గుర్తించేందుకు ఇప్పటికే కోస్టుగార్డు నౌకలు ప్రయత్నాలు చేస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు 7 మంది మత్స్యకారులతో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లింది. సాధారణంగా ఈ బోటు జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికి తిరిగి రావాల్సి ఉండగా, ఇప్పటికీ తిరిగి రాలేదని అధికారులు తెలిపారు.
గంగవరం సముద్ర తీర ప్రాంతం సమీపంలో బోటుకు సాంకేతిక సమస్య వచ్చినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కారణంగానే బోటు గల్లంతైన పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లతో కూడా సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
గాలింపు చర్యలను మరింత సమన్వయంతో కొనసాగించాలని ముఖ్యమంత్రి మెరైన్ ఐజీ మరియు విశాఖ సీపీని ఆదేశించారు. ప్రతి అప్డేట్ను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. అలాగే మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఘటనతో మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం అన్ని విభాగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను వేగవంతం చేసింది.
Tags
Be the first to react