Machilipatnam: మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి కొల్లు రవీంద్ర!
Machilipatnam: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైనార్టీల ప్రార్థనా మందిరాలు, ఖబరిస్తాన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నంలో ఖబరిస్తాన్లు, ప్రార్థనా మందిరాల అభివృద్ధికి రూ.1.21 కోట్లు మంజూరు..
మైనార్టీ అభివృద్ధి పనులకు నిధులు – మంత్రి కొల్లు రవీంద్రకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు..
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైనార్టీల ప్రార్థనా మందిరాలు, ఖబరిస్తాన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1,21,62,492 వ్యయంతో ప్రార్థనా మందిరాలు, ఖబరిస్తాన్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ నిధులతో మైనార్టీ వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మచిలీపట్నంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బెగ్, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ అజీమ్ నేతృత్వంలో పలువురు మైనార్టీ నాయకులు మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, మచిలీపట్నం నియోజకవర్గంలో మైనార్టీల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనుల మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కొల్లు రవీంద్రకు ధన్యవాదాలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రార్థనా మందిరాలు, ఖబరిస్తాన్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం మైనార్టీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అబు తాలిబ్ మీర్జా, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖాజా, ఫిరోజ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags
Be the first to react