Weather Update: ముంబైకి ఐఎండీ 'రెడ్ అలర్ట్'.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న బీఎంసీ!

Weather Update: ర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రానున్న గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ముంబైకి ఐఎండీ 'రెడ్ అలర్ట్'..
ముంబైకి ఐఎండీ 'రెడ్ అలర్ట్'..
  • ముంబైని ముంచెత్తిన భారీ నుంచి అతి భారీ వర్షాలు..

  • లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన రవాణా..

Weather Update: భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని ఊహించని రీతిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల దాటికి యావత్ ముంబై నగరం పూర్తిగా అతలాకుతలమైంది. నగరంలో నెలకొన్న ఈ అత్యంత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి అత్యవసర 'రెడ్ అలర్ట్' (Red Alert) జారీ చేసింది. రానున్న మరికొద్ది గంటల పాటు నగరవ్యాప్తంగా ఇదే రీతిలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు నగర ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి అందిన అధికారిక గణాంకాల ప్రకారం, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 200 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైంది.

నగరంలోనే అత్యధికంగా విఖ్రోలి వెస్ట్ ప్రాంతంలో 310.6 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురవగా, కొలాబా పంపింగ్ స్టేషన్ పరిధిలో 306.6 మిల్లీమీటర్లు, అలాగే టాగోర్ నగర్ ప్రాంతంలో 301.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కుండపోత వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తూ పూర్తిగా జలమయమయ్యాయి. నీటి ఉధృతికి పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోగా, వందలాది చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులు, సబర్బన్ రైల్వే ట్రాక్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ముంబై లైఫ్ లైన్ గా పిలిచే సబర్బన్ లోకల్ రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.

నగరంలో వరద ముప్పు పొంచి ఉన్న ఈ క్లిష్ట పారస్థితుల్లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఉన్నతాధికారులు అలర్ట్ అయి ప్రజలను అప్రమత్తం చేశారు. నగర ప్రజలు అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారు మరియు అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారు బీఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విపత్తు హెల్ప్లైన్ నంబర్ 1916ను తక్షణమే సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటల సమయంలో అరబిక్ సముద్రంలో సుమారు 4.19 మీటర్ల ఎత్తున ప్రమాదకర రీతిలో హైటైడ్ (పెద్ద అలలు) ఎగిసిపడే అవకాశం ఉందని, ఆ సమయంలో సముద్రపు నీరు నగరంలోకి వచ్చే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు నగరంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముంబై నగరంతో పాటు దాని ఉప నగరాలైన థానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప పరిసర ప్రాంతాల్లోనూ ఇదే విధమైన భారీ వర్ష సూచికతో కూడిన వరద పరిస్థితి నెలకొనడంతో యంత్రాంగం హై అలర్ట్లో ఉంది.

Tags

Be the first to react

Latest