AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్... రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణాలు!

AP Farmers: ఏపీ ప్రభుత్వం పొగాకు రైతులకు రూ. 50 వేల వడ్డీలేని రుణం (2 ఏళ్ల కాలపరిమితితో) ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్వింటా పొగాకుకు రూ. 1,000 చొప్పున ప్రోత్సాహకాన్ని కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణాలు
రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణాలు
  • ఏపీ రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు బిగ్ గిఫ్ట్!
  • కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ...
  • డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌తో రైతులకు ఆర్థిక ఊరట!

AP Farmers: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పొగాకు రైతులకు మద్దతుగా పలు సంక్షేమ చర్యలను ప్రకటించారు. ప్రతి పొగాకు రైతుకు రూ. 50 వేల చొప్పున రుణాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ రుణానికి సంబంధించి రెండేళ్ల పాటు ఎటువంటి వడ్డీ లేకుండా (వడ్డీ లేని రుణం) ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వింటా పొగాకుకు రూ. 1,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాన్ని (Incentive) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో పొగాకు కొనుగోళ్లు పూర్తయిన 9 రోజులలోపే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నగదును జమ చేసేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అచ్చెన్నాయుడు వివరించారు.

అలాగే మార్కెట్ సమతుల్యత మరియు గిట్టుబాటు ధరలను కాపాడే ఉద్దేశంతో వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే ప్రతిపక్షాలు దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Tags

Be the first to react

Latest