PPP Policy: ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల... రూ.1,500 కోట్ల వీజీఎఫ్ ఫండింగ్‌తో బిగ్ ప్లాన్!
PPP Policy: ఏపీ ప్రభుత్వం ‘పీపీపీ పాలసీ-2026’ను విడుదల చేస్తూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కేటాయించింది. రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
- స్వర్ణాంధ్ర విజన్-2047 దిశగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
- ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్!
- ఇక ప్రాజెక్టులకు నిధుల కొరతే ఉండదు!
PPP Policy: రాష్ట్రంలో రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం మరియు పర్యాటకం వంటి కీలక రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులకు మూలధన సాయం అందించేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రారంభ దశలో ఆర్థికంగా స్వయం సమృద్ధి లేని, అయితే భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రాజెక్టులకు ‘ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్’ ద్వారా వడ్డీలేని రుణాలు అందించే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పీపీపీ నమూనాలు మరియు ప్రధాన స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విధానాన్ని రూపొందించారు. ప్రాజెక్టుల ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు మరియు పర్యవేక్షణను పారదర్శకంగా చేపట్టేలా స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈ పీపీపీ పాలసీ-2026ను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tags
Be the first to react