మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించడమే నిజమైన సుపరిపాలన అని నమ్మిన సీఎం చంద్రబాబు... నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి సుపరిపాలననే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులపై ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల వద్దకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల అమలును వివరించాలి. ఒక పండుగలా ఈ ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిద్దాం.
గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. అప్పులు, విధ్వంసం, దోపిడీ, దౌర్జన్యాలే పాలసీలుగా పాలన సాగించాడు. పోలవరం విధ్వంసం చేసి, అమరావతిని మూడు ముక్కులు చేసిన రాష్ట్ర అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టాడు.
చంద్రబాబు సారథ్యంలో విధ్వంసకారి పాలన నుంచి విజనరీ పాలన మొదలైంది. నేడు రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం దిశగా పరుగులు పెడుతోంది. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేశాడు. చంద్రబాబు తన అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడుల వరద ప్రవాహాన్ని తిరిగి తీసుకొచ్చారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి సమాంతరంగా చేసి చూపిస్తున్నారు. రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, 26 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు.
సూపర్ సిక్స్‌తో ప్రజా సంక్షేమానికి గట్టి పునాది
సూపర్ సిక్స్ పథకాల అమలుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేకూరుతోంది. దాదాపు రూ.70 వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. పెన్షన్ల కోసమే ఈ 18 నెలల పాలనలో రూ.51 వేల కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసి ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది. ఆగస్టు 15 నుంచి అమలు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఎక్కడా గొడవలు లేవు, బస్సులు లేవనే ఫిర్యాదులు లేవు ఇప్పటికే రూ.1200 కోట్లు స్త్రీ శక్తికి కేటాయించాం. ఇమామ్ మౌజమ్ ల కోసం రూ.135 కోట్లు కేటాయించాం. పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.81 కోట్లు అందజేశాం. హజ్ యాత్రికులకు లక్ష సాయం అందజేస్తున్నాం. 205 అన్నక్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 7 కోట్లకుపైగా ప్రజలకు భోజనం అందజేశాం.
ఒక్క సంతకంతో మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 టీచర్ పోస్టుల భర్తీ చేశాం. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానిస్లేబుల్ పరీక్షలు నిర్వహించి 5,757 కానిస్టేబుల్ నియామకాలు పూర్తిచేశాం. ఈ ఖరీఫ్ సీజన్‌లో 34.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 5.59 లక్షల రైతులకు రూ.8,206 కోట్లు 24 గంటల్లో జమ చేశాం. రూ.3870 కోట్లు ఖర్చు చేసిన హంద్రీనీవా కాలువ విస్తరణను 100 రోజుల్లోనే పూర్తి చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులు 88 శాతం పూర్తి చేశాం. 2027 కి నీటిని ఇచ్చేలా పనులు చేస్తున్నాం. 2026 ఆయకట్టు రైతులకు నీరు ఇచ్చేలా వెలిగొండ పనులు జరుగుతున్నాయి.
జగన్ పర్మినెంట్ అడ్రస్ ఇక బెంగళూరే:
విధ్వంసం, విషప్రచారం ఇదే అజెండాగా 18 నెలలుగా రాష్ట్రంలో జగన్ రెడ్డి సైకో ముఠా పనిచేస్తోంది. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ముఠా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. తనకు అనుకూలమైన మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారాలు, ఫేక్ కథనాలు సృష్టిస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్లీ ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అది జగన్ కు స్ఫష్టంగా తెలిసే బెంగళూరుకు మకాం మార్చాడు.