ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్న తరుణంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రకటించిన అదనపు డేటా ఆఫర్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా డేటా ఎక్కువగా వాడే యూజర్ల కోసం రూ. 225 ప్లాన్‌పై అందిస్తున్న ప్రయోజనాలను పెంచడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్లాన్ విశేషాలు మరియు బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఇతర 'హాలిడే బొనాంజా' ఆఫర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ తన పాపులర్ STV 225 ప్లాన్‌పై డేటా ప్రయోజనాలను పెంచుతూ అధికారికంగా 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. సాధారణంగా ఈ ప్లాన్‌పై రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. కానీ తాజా ఆఫర్ కింద, అదనంగా మరో 500MB కలిపి.. ప్రతిరోజూ 3GB డేటాను అందిస్తోంది. వాస్తవానికి ఈ ఆఫర్ జనవరి 4వ తేదీతో ముగియాల్సి ఉంది.
కానీ వినియోగదారుల విన్నపం మేరకు దీనిని జనవరి 31, 2026 వరకు పొడిగించారు. 3GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited Calls), జాతీయ రోమింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 225 ప్లాన్ మాత్రమే కాకుండా, మరో మూడు ప్లాన్లపై కూడా అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది.
అయితే వీటి పొడిగింపుపై కంపెనీ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ, ప్రస్తుతానికి ఇవి అందుబాటులో ఉన్నాయి. STV 225, STV 347, STV 485, PV 2399 ఈ ప్రీమియిడ్ ఓచర్లలో ప్రతి ఒక్కటి అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కలిగి ఉంటాయి. జనవరి 31 ముందు రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ప్రతిరోజూ 3GB హై స్పీడ్ డేటాను పొందుతారు.
ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ ఉన్నప్పటికీ.. రూ.225 వోచర్‌ను హైలెట్ చేసినందుకు, సబ్‌స్క్రైబర్‌లు వారి నిర్దిష్ట డేటా బోనస్‌లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్‌ను సెర్చ్ చేయాలని సూచిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ సామాన్య మధ్యతరగతి వినియోగదారులకు గొప్ప ఊరట. అతి తక్కువ ధరలో రోజుకు 3GB డేటా ఇవ్వడం అనేది ప్రస్తుతం మార్కెట్లో మరే ఇతర టెలికాం సంస్థ చేయడం లేదు. సంక్రాంతి పండుగ పూట యూట్యూబ్ వీడియోలు చూడటానికి, సినిమాలను స్ట్రీమ్ చేయడానికి ఈ 3GB డేటా ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది.