మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

2026-01-07 12:14:00
ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం!

రైలు ప్రయాణం చేయాలనుకునే సామాన్యుడికి టికెట్ దొరకడం అనేది ఇప్పుడు ఒక యుద్ధంలా మారిపోయింది. కంప్యూటర్ ముందు కూర్చుని బుకింగ్ స్టార్ట్ చేయగానే సెకన్ల వ్యవధిలో టికెట్లు మాయమైపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ 'టికెట్ల దందా'కు, అక్రమ బుకింగ్స్ సాఫ్ట్‌వేర్లకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రైల్వే (Indian Railways) మరియు ఐఆర్‌సీటీసీ (IRCTC) నడుం బిగించాయి. ఇందులో భాగంగా 'ఆధార్ అథెంటికేషన్' (Aadhar Authentication) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.!

ఐఆర్‌సీటీసీ యాప్‌లో లాగిన్ అయ్యే ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేసి, వెరిఫై చేసుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే, అత్యంత రద్దీగా ఉండే సమయాల్లో కేవలం వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది.

సంక్రాంతి సెలవులు పొడిగింపు - ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.! జనవరిలో విద్యార్థులకు ఏకంగా..

గతేడాది అక్టోబర్ 1 నుంచే జనరల్ టికెట్ రిజర్వేషన్‌కూ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఫలితంగా ఐఆర్‌సీటీసీ‌ యాప్‌నకు ఆధార్ లింక్ చేసిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుకింగ్ చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్ 29, 2025 నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆధార్ అథెంటికేషన్ ఖాతాలకే బుకింగ్ సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఈ సమయాన్ని మరింత పొడిగించారు.

Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం…! ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు!

జనవరి 5వ తేదీ నుంచి 8 గంటల పాటు బుకింగ్ సమయం కల్పిస్తున్నారు. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కేవలం ఆధార్ అథెంటికేషన్ ఉన్న వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ వెరిఫై చేయని వారు ఆ తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల టికెట్ల బుకింగ్ అక్రమాలకు చెక్ పెట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది.

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు!

అంతేకాదు, జనవరి 12వ తేదీ నుంచి ఈ సమయం 14 గంటలకు పెరగనుంది. అంటే ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచనున్నారు. ఈ సమయంలో కేవలం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. దీంతో పూర్తిగా అక్రమార్కులకు చెక్ పడనుందని రైల్వే శాఖ అంటోంది.

Aadhar Kaushal Scholarship: కౌశల్ స్కాలర్‌షిప్‌తో రూ.50,000 వరకు ఆర్థిక సహాయం.. కానీ ఈ అర్హత లేకపోతే అవకాశం లేదు!

అటు, తత్కాల్ టికెట్లకు సైతం 2025, జులై 1 నుంచే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 2025, జులై 15 నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసినా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ సమయంలో బుకింగ్ రూల్స్ కఠినతరం చేశారు.

Technology News: పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఇది తప్పక చేయండి… లేకపోతే అంతే!!

అయినప్పటికీ సాధారణ ఐఆర్‌సీటీసీ యూజర్లు తత్కాల్ బుకింగ్స్ వంటి కీలక సమయంలో చేసే బుకింగ్స్ తీరు పెద్దగా మారలేదని పెదవి విరుస్తుండటం గమనార్హం.

Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ!

టికెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి ఆధార్ లింకింగ్ అనేది ఒక మంచి ముందడుగు. మీరు మీ సంక్రాంతి లేదా వేసవి సెలవుల ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, వెంటనే మీ ఐఆర్‌సీటీసీ ఖాతాను ఆధార్‌తో వెరిఫై చేసుకోండి. లేదంటే కీలకమైన బుకింగ్ సమయాల్లో మీరు టికెట్లు పొందే అవకాశం కోల్పోవచ్చు.

Solar Project: దేశంలోనే అతిపెద్ద సోలార్ తయారీ యూనిట్ ఏపీలోనే! ఎక్కడంటే..?
Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు!
Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!
Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!

Spotlight

Read More →