నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం (polavaram) ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనులు వేగవంతం చేయడం, సమస్యల పరిష్కారంపై సీఎం కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.
పోలవరం పర్యటన అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (cm chandrababu) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధిత ముఖ్యమైన అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలు, అలాగే కేంద్ర కేబినెట్ విస్తరణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.