న్యూజెర్సీలో చిన జీయర్ స్వామికి ఘన స్వాగతం.. నవంబర్ 17 వరకు ఆధ్యాత్మిక వేడుకలు!
Chinna Jeeyar Swamy's 70th Tirunakshatram: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పూజ్య చిన జీయర్ స్వామివారికి స్థానిక తెలుగు, భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జీయర్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూఎస్ఏ (JET New Jersey) ఆధ్వర్యంలో స్వామివారి పర్యటన సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి రాకతో న్యూజెర్సీలోని భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
అమెరికాలో చిన జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర వేడుకలు.. న్యూజెర్సీలో భారీ ఏర్పాట్లు..
న్యూజెర్సీలో శ్రీ సంజీవని హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం.. భక్తులకు ఆహ్వానం..
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పూజ్య చిన జీయర్ స్వామివారికి స్థానిక తెలుగు, భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జీయర్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూఎస్ఏ (JET New Jersey) ఆధ్వర్యంలో స్వామివారి పర్యటన సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి రాకతో న్యూజెర్సీలోని భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
న్యూజెర్సీలోని విల్లింగ్‌బోరో ప్రాంతంలో ఉన్న 494 Beverly Rancocas Rd, Willingboro, NJ 08046 వేదికగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. నవంబర్ 17 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా పూజ్య చిన జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అదే విధంగా శ్రీ సంజీవని హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కూడా వైభవంగా జరగనుంది.
ఈ రెండు పవిత్ర కార్యక్రమాలను భక్తి, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు, శ్రీ సంజీవని హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పిస్తున్నారు. న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భక్తులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
కార్యక్రమాల పూర్తి వివరాలు, ఇతర సమాచారం కోసం భక్తులు JET New Jersey అధికారిక వెబ్‌సైట్ jetnj.org ను సందర్శించవచ్చు. అమెరికాలోని ప్రవాస భారతీయుల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ వేడుకలు నిర్వహించడం విశేషం.