అమెరికాలో జైన్ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన! ఇండియన్ అసోసియేషన్ ఫర్ నార్త్ టెక్సాస్ కు ప్రత్యేక ఆహ్వానం!
Frisco Jain Temple Bhoomi Pooja: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నిర్మించనున్న నూతన జైన్ దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు హాజరుకావాల్సిందిగా ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT)కు ఉత్తర టెక్సాస్ జైన్ సమాజం ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ ఆహ్వానం తమ సంస్థకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు IANT ప్రకటించింది. అమెరికాలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
అమెరికాలో జైన్ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన.. IANTకు ప్రత్యేక ఆహ్వానం.. చారిత్రాత్మక వేడుకలో భాగస్వామ్యం..
అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి మరో చిరునామా.. ఫ్రిస్కోలో నూతన జైన్ ఆలయం..
ఫ్రిస్కో (టెక్సాస్): అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో నిర్మించనున్న నూతన జైన్ దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు హాజరుకావాల్సిందిగా ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT)కు ఉత్తర టెక్సాస్ జైన్ సమాజం ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ ఆహ్వానం తమ సంస్థకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు IANT ప్రకటించింది. అమెరికాలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
ఫ్రిస్కోలో నూతన జైన్ దేవాలయ నిర్మాణం ఆ ప్రాంతంలోని జైన్ సమాజానికి ఎంతో ప్రత్యేకమైన సందర్భం. ఎన్నో సంవత్సరాలుగా జైన్ సమాజం సభ్యులు చూపిస్తున్న అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం, పరస్పర ఐక్యత, సమిష్టి కృషికి ఈ ఆలయ నిర్మాణం ప్రతీకగా నిలుస్తుందని IANT పేర్కొంది. ఒక సమాజం ఎన్నో ఏళ్లుగా కన్న కలలు, చేసిన ప్రయత్నాలు ఒక రూపం దాల్చుతున్న ఈ సందర్భం నిజంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన అవకాశమని అభివర్ణించింది.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడం తమకు ఎంతో గర్వకారణమని IANT ప్రతినిధులు తెలిపారు. రాబోయే తరాలకు కూడా గుర్తుండిపోయే శాశ్వత వారసత్వాన్ని సృష్టించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఉత్తర టెక్సాస్ జైన్ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జైన్ సమాజానికి చెందిన JSNT నాయకత్వ బృందం, వాలంటీర్లు, మద్దతుదారులు, కమ్యూనిటీ సభ్యులకు IANT హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ప్రతి ఒక్కరి కృషి, సహకారం అభినందనీయమని పేర్కొంది. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాకారమవుతాయని వెల్లడించింది.
నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ నూతన జైన్ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలంగానే కాకుండా, రాబోయే తరాలకు శాంతి, ఆధ్యాత్మికత, ఐక్యత, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసే కేంద్రంగా ఎదగాలని IANT ఆకాంక్షించింది. వివిధ భారతీయ సంఘాలు పరస్పరం సహకరించుకుంటూ బలమైన కమ్యూనిటీల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఫ్రిస్కోలో రూపుదిద్దుకోనున్న ఈ జైన్ దేవాలయం అమెరికాలోని భారతీయ సమాజానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలవనుంది.