Vande Bharat: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి.. వందే భారత్‌లో తొలిసారిగా సజీవ గుండె రవాణా!

Vande Bharat: భారతీయ రైల్వే అత్యవసర వైద్య సేవల రంగంలో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా సజీవ గుండె (Live Heart)ను విజయవంతంగా రవాణా చేసి ప్రాణాలను కాపాడే కీలక మిషన్‌ను పూర్తి చేసింది. ఈ సజీవ గుండెను సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు ముంబై సెంట్రల్–గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20901) ద్వారా సురక్షితంగా తరలించారు.

Live Heart Transport In Vande Bharat
Live Heart Transport In Vande Bharat

సజీవ గుండెను సమయానికి చేర్చిన వందే భారత్.. ప్రాణాలను కాపాడిన రైల్వే..

భారతీయ రైల్వే ఘనత.. వందే భారత్‌లో తొలి లైవ్ హార్ట్ రవాణా విజయవంతం..

భారతీయ రైల్వే అత్యవసర వైద్య సేవల రంగంలో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా సజీవ గుండె (Live Heart)ను విజయవంతంగా రవాణా చేసి ప్రాణాలను కాపాడే కీలక మిషన్‌ను పూర్తి చేసింది. ఈ సజీవ గుండెను సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు ముంబై సెంట్రల్–గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20901) ద్వారా సురక్షితంగా తరలించారు. అనంతరం అహ్మదాబాద్‌లోని యు.ఎన్. మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) కోసం అందజేశారు.

అహ్మదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) వేద్ ప్రకాశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సజీవ గుండెను సమయానికి, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం భారతీయ రైల్వేకు ఎంతో గర్వకారణమని తెలిపారు.

ప్రాణాలను కాపాడే ఇలాంటి అత్యవసర మిషన్‌లలో ప్రతి క్షణం అత్యంత కీలకమని, భారతీయ రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గుజరాత్ రాష్ట్ర పోలీస్, వైద్య బృందాల మధ్య జరిగిన అద్భుత సమన్వయమే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్-1 నుంచి యు.ఎన్. మెహతా ఆస్పత్రి వరకు RPF మరియు గుజరాత్ పోలీస్ ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశాయి. దీంతో ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా గుండెను నిర్ణీత సమయంలో ఆస్పత్రికి చేరవేయగలిగారు. దీనివల్ల గుండె మార్పిడి ప్రక్రియలో ఆలస్యం జరగకుండా వైద్యులు విజయవంతంగా ముందుకు సాగేందుకు అవకాశం లభించింది.

ఈ మిషన్ విజయానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సమయపాలన, విశ్వసనీయత కీలకంగా నిలిచాయని అధికారులు తెలిపారు. అత్యవసర వైద్య అవసరాల్లో వేగవంతమైన రవాణా ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు.

భారతీయ రైల్వే కేవలం ప్రయాణికులు, సరుకు రవాణాకే పరిమితం కాదని, అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సేవల్లోనూ కీలక భాగస్వామిగా నిలుస్తోందని డీఆర్‌ఎం వేద్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఒక మానవ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగస్వాములు కావడం తమకు సేవా ధర్మమని ఆయన అన్నారు.

ఈ చారిత్రక ఆపరేషన్ విజయవంతం కావడంలో భారతీయ రైల్వే అధికారులు, RPF, గుజరాత్ రాష్ట్ర పోలీస్, వైద్య నిపుణులు, అవయవ మార్పిడి సమన్వయకర్తలు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు కీలక పాత్ర పోషించారు. అందరి సమన్వయంతో అత్యంత సున్నితమైన, సమయపాలన అవసరమైన ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షణలో వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రయాణ సేవలకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ప్రయాణ సేవలతో పాటు అత్యవసర ఆరోగ్య సేవల్లోనూ భారతీయ రైల్వే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోందని పేర్కొన్నారు.

Tags

1 readers have reacted

Latest