Bhogapuram–Vijayawada: భోగాపురానికి యూకే, యూరప్ నుంచి నేరుగా విమాన సర్వీసులు.. కేంద్రానికి ప్రతిపాదన!

Bhogapuram–Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలకు విదేశాల నుంచి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ అంశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఏపీ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి జయ్ కుమార్ గుంటుపల్లి చర్చించారు.

భోగాపురానికి యూకే, యూరప్ నుంచి నేరుగా విమాన సర్వీసులు
భోగాపురానికి యూకే, యూరప్ నుంచి నేరుగా విమాన సర్వీసులు

ఏపీ విమాన కనెక్టివిటీకి బూస్ట్.. భోగాపురం, విజయవాడకు అంతర్జాతీయ సర్వీసుల ప్రతిపాదనలు..

భోగాపురం, విజయవాడ, తిరుపతిలో ఇమ్మిగ్రేషన్ సదుపాయం.. కీలక ప్రతిపాదనలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలకు విదేశాల నుంచి మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ అంశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఏపీ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి జయ కుమార్ గుంటుపల్లి చర్చించారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు మరింత పెంచే అవకాశం ఉందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా యూకే, యూరప్ దేశాల నుంచి భోగాపురానికి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అదే విధంగా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ తదితర గల్ఫ్ దేశాల నుంచి భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. దీనివల్ల విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు స్వదేశానికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

విజయవాడ, భోగాపురం, తిరుపతి విమానాశ్రయాల్లోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రతిపాదించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇతర విమానాశ్రయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గేలా ఈ సదుపాయాలను బలోపేతం చేయాలని కోరారు.

విమాన ప్రయాణంలో తొలిసారి అడుగుపెట్టే వారికి కూడా ప్రత్యేక సహాయం అందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం First-time Air Travellers కోసం ప్రత్యేక గైడెన్స్ యాప్ రూపొందించాలని సూచించారు. విమాన టికెట్ బుకింగ్ నుంచి చెక్-ఇన్, బ్యాగేజీ, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాల వరకు ప్రయాణికులకు సులభంగా మార్గదర్శనం అందేలా యాప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

విదేశాలకు వెళ్లి తమ పిల్లలను కలుసుకునే భారతీయ తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే అంశాన్ని కూడా ప్రతిపాదనల్లో చేర్చారు. వయోవృద్ధ తల్లిదండ్రులు విదేశాలకు ప్రయాణించే సమయంలో ఆరోగ్యపరమైన భద్రత ఉండేలా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అలాగే విదేశీ విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు అదనపు చెక్-ఇన్ బ్యాగేజీ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండాల్సిన విద్యార్థులకు అదనపు సామగ్రి తీసుకెళ్లే అవసరం ఉంటుందని, ఈ సదుపాయం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.

విమాన కనెక్టివిటీ మెరుగుపడితే కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరిగితే పర్యాటకం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.

ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయాన్ని యూరప్, యూకే, గల్ఫ్ దేశాలతో అనుసంధానించడం ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా అంతర్జాతీయ రాకపోకలు పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు జయ్ కుమార్ గుంటుపల్లి పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఏపీని అంతర్జాతీయ ప్రయాణాలకు కీలక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags

Be the first to react

Latest