Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... కల్వర్టులో పడిన ప్రైవేట్ బస్సు! 20 మందికి...
Road Accident: అనంతపురం జిల్లా పామిడి వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు, ఐషర్ వాహనం ఢీకొని కల్వర్టులో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్ర గాయాలవగా, పరిస్థితి విషమంగా ఉన్న డ్రైవర్లను అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
నిద్రమత్తు, అతివేగమే ప్రాణ సంకటమైందా?.. అనంతపురం జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాద దృశ్యాలు!..
కల్వర్టు కింద నలిగిపోయిన బస్సు, ఐషర్ క్యాబిన్లు!.. డ్రైవర్ల పరిస్థితి విషమం!..
పొగరూరు వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలు!.. కల్వర్టులో పడిన బస్సు నుంచి కాపాడిన పోలీసులు!..
Anatapur Road Accident: హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు ప్రయాణికులతో వెళ్తున్న నవంబర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొగరూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని డీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బస్సు మరియు ఐషర్ వాహనాలు కల్వర్టు కిందకు దూసుకెళ్లడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు వెంటనే పామిడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్సు, ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను మరియు గాయపడిన ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుల్లో ఐషర్ డ్రైవర్‌తో పాటు ప్రైవేట్ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సాయిలత, సారా, చరణ్, గణేష్, రఘురాం, ప్రవీణ్, ఫమీద, శరణ్య, బ్రహ్మయ్య, సుభాగి, వివేక్, ఉమేష్ తదితరులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ ప్రమాదంపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వాహనాల వేగం ఎక్కువగా ఉండటం మరియు తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Tags
Be the first to react