హైదరాబాద్‌లో వాసులకు అలర్ట్.. 24 గంటల పాటు నీటి సరఫరా బంద్!
Hyderabad Water Supply Alert: నగరంలోని సూరారం, సాయిబాబా నగర్ వార్డుల ప్రజలకు జలమండలి కీలక సూచన జారీ చేసింది. ఈ రెండు వార్డుల పరిధిలో నవంబర్ 21 రాత్రి నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తాగునీటి పైపులైన్‌ను మార్చాల్సి ఉండటంతో తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ముందుగానే అప్రమత్తమై అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో ఈ రెండు వార్డులకు 24 గంటలు నీటి కష్టాలు.. జలమండలి కీలక ప్రకటన..
హైదరాబాద్‌లో పైప్‌లైన్ పనులు.. నవంబర్ 21 రాత్రి నుంచి 22 వరకు నీటి సరఫరా బంద్..
హైదరాబాద్: నగరంలోని సూరారం, సాయిబాబా నగర్ వార్డుల ప్రజలకు జలమండలి కీలక సూచన జారీ చేసింది. ఈ రెండు వార్డుల పరిధిలో నవంబర్ 21 రాత్రి నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తాగునీటి పైపులైన్‌ను మార్చాల్సి ఉండటంతో తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ముందుగానే అప్రమత్తమై అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సూరారం చెరువు నుంచి శివాలయ నగర్‌లోని 14 ఎంఎల్డీ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) వరకు చేపట్టిన సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మాణ మార్గంలో ఉన్న 700 ఎంఎం వ్యాసం కలిగిన తాగునీటి పైపులైన్‌ను మరోచోటుకు మార్చాల్సి ఉంది.
ఈ పైపులైన్ మార్పిడి పనులను సూరారం ప్రధాన రహదారిపై మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగా చేపట్టనున్నారు. నవంబర్ 21వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పనులు నవంబర్ 22వ తేదీ రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ కారణంగా మొత్తం 24 గంటల పాటు సంబంధిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి వెల్లడించింది.
సూరారం వార్డులోని విశ్వకర్మ కాలనీ, వైష్ణవి నగర్, వేమారెడ్డి నగర్, లక్ష్మీనగర్, సూరారం గ్రామంపై ఈ ప్రభావం ఉండనుంది. అదేవిధంగా సాయిబాబా నగర్ వార్డులోని తెలుగు తల్లి నగర్, జై భీమ్ నగర్, మైత్రి నగర్, సూరారం కాలనీ ప్రాంతాల ప్రజలు కూడా నీటి సరఫరా సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా నీటి సరఫరా నిలిచిపోదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పనులు పూర్తయిన తర్వాత నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నవంబర్ 21 రాత్రి 9 గంటలలోపే తమ రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని ముందుగా నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది. సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. పైపులైన్ మార్పిడి పనులు పూర్తయ్యే సమయంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tags
Be the first to react