విద్యార్థుల కోసం గూగుల్ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ‘జెమినీ ఫర్ స్టూడెంట్స్’ పేరిట 18 ఏళ్లు పైబడి ఉన్న విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా Google AI Pro ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది.
ఈ సేవలను వినియోగించాలంటే విద్యార్థులు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీలో సెప్టెంబర్ 15, 2025 లోపు నమోదు చేసుకోవాలి. నమోదు పూర్తయిన తర్వాత, గూగుల్ పవర్‌ఫుల్ ఏఐ మోడల్ అయిన Gemini 2.5 Pro, వీడియో జనరేషన్ మోడల్ Veo 3 వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
ఈ ప్లాన్‌తో Gmail, Docs, ఇతర గూగుల్ యాప్‌లలో AI ఫీచర్లతో పాటు 2TB స్టోరేజ్, చదువుతో సంబంధమైన రైటింగ్, రీసెర్చ్, పరీక్షల తయారీ, కోడింగ్, హోంవర్క్ తదితర విషయాల్లో అన్‌లిమిటెడ్ అకడమిక్ సపోర్ట్ లభిస్తుంది.
ప్రస్తుతం చదువుతో పాటు భవిష్యత్ ప్రణాళికలకు ఏఐ టూల్స్ అవసరమవుతుండటంతో విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాలు కూడా ఈ మార్పులో భాగమవుతున్నాయి. గూగుల్ అందిస్తున్న ఈ ప్లాన్‌కు విద్యార్థుల సంఖ్యపై ప్రస్తుతం ఎటువంటి పరిమితి విధించలేదు.