రైల్వే మంత్రిత్వ శాఖ టికెటింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని ముందుకు మార్చిన నేపథ్యంలో, అత్యవసర కోటా (Emergency Quota - EQ) టికెట్ల కోసం దరఖాస్తు సమయాల్లో తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
కొత్త నియమాలు ఇవే:
రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు EQ అభ్యర్థనలు ప్రయాణానికి ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు సమర్పించాలి.
మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు EQ అభ్యర్థనలు ప్రయాణానికి ముందు రోజు సాయంత్రం 4 గంటల లోపు EQ సెల్‌కు అందాల్సిందే.
ప్రయాణం జరిగే రోజున పంపిన అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోబోరని స్పష్టం.
సెలవులపై ప్రత్యేక సూచనలు:
ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవుల్లో EQ టికెట్ల కోసం ముందుగానే అభ్యర్థనలు సమర్పించాలి.
ఆదివారం తర్వాత సెలవులున్నపుడు కూడా ముందస్తుగా – పని దినాల్లో, కార్యాలయ సమయాల్లోనే దరఖాస్తు చేయాలి.
అధికారులకు గైడ్‌లైన్స్:
రైల్వే బోర్డు VIPలు, సీనియర్ అధికారులు పంపే EQ అభ్యర్థనలు అధికంగా ఉండటంతో, కోటాను న్యాయంగా, సమర్థవంతంగా కేటాయించేందుకు సమయపాలన తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
చార్ట్ ఆలస్యం కాకుండా కొత్త సమయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించింది.