ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త! అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ నెల 28 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పోస్టింగ్ కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.