Android 17: ఆండ్రాయిడ్ 17 లో అద్భుతమైన ఫీచర్లు.. మొబైల్ వాడకం ఇక మరింత ఈజీ!

Android 17: ఫోన్ సెట్టింగ్స్ లో ఏదైనా ఆప్షన్ ఎక్కడ ఉందో వెతుక్కోవడం కష్టంగా ఉంటే, దానికి పరిష్కారంగా 'ఆస్క్ పిక్సెల్' అనే కొత్త ఫీచర్ ను తెచ్చారు. ఇది మనం అడిగిన సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా గైడ్ చేస్తుంది. ఇక హోమ్ స్క్రీన్ మరింత అందంగా కనిపించడానికి యాప్స్ కింద పేర్లు లేకుండా దాచే (హైడ్ చేసే) ఆప్షన్ ను వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లో చేర్చారు. దీనితో పాటు స్ప్లిట్ స్క్రీన్ (రెండు యాప్స్ ఒకేసారి వాడటం) వాడుతున్నప్పుడు యాప్స్ స్క్రీన్ సైజును సులభంగా పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి మధ్యలో బాణాలు (ఆరోస్) లాంటి గుర్తులను కూడా ఏర్పాటు చేశారు.

ఆండ్రాయిడ్ 17 లో అద్భుతమైన ఫీచర్లు
ఆండ్రాయిడ్ 17 లో అద్భుతమైన ఫీచర్లు
  • వైఫై, డేటాకు వేర్వేరు బటన్స్.. ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే మార్పులు.

  • స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ సెల్ఫీ.. ఆండ్రాయిడ్ 17 కొత్త ఫీచర్ తో అదుర్స్.

  • ఒకేసారి 5 యాప్స్.. బబుల్స్ ఫీచర్ తో మల్టీటాస్కింగ్ కు కొత్త అర్థం.

Android 17: టెక్ దిగ్గజం గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆండ్రాయిడ్ 17' స్టేబుల్ వెర్షన్ ను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ అప్డేట్ గూగుల్ పిక్సెల్ 6, ఆ పైబడిన మోడల్స్ కు అందుబాటులోకి రాగా, భవిష్యత్తులో శాంసంగ్, వన్ ప్లస్ లాంటి ఇతర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లకు కూడా విడతల వారీగా ఈ ఏడాది చివర్లో రానుంది. పాత ఆండ్రాయిడ్ 16 తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్ లో వినియోగదారుల సౌకర్యం కోసం గూగుల్ ఎన్నో అద్భుతమైన ఫీచర్లను మరియు మార్పులను ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్ వాడకాన్ని మరింత సులభతరం చేసేలా డిజైన్ చేసిన ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కొత్త వెర్షన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల్టీటాస్కింగ్ ను సులభతరం చేసే 'పాప్ అప్ యాప్స్' లేదా 'బబుల్స్' ఫీచర్. దీని ద్వారా వినియోగదారులు ఒకేసారి ఏకంగా ఐదు యాప్స్ ను చిన్న బబుల్స్ లాగా స్క్రీన్ పై ఓపెన్ చేసి సులభంగా వాడుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 16 లో వైఫై, మొబైల్ డేటా రెండింటినీ ఒకే బటన్ లో ఇచ్చి యూజర్లను గందరగోళానికి గురిచేసిన గూగుల్, ఈసారి ఆ తప్పును సరిదిద్దింది. ఆండ్రాయిడ్ 17 లో వైఫై మరియు మొబైల్ డేటాలను ఆన్, ఆఫ్ చేసుకోవడానికి పైభాగంలో వేర్వేరు బటన్లను (టాగల్స్) అందించడం ఎంతో ఉపయోగకరమైన మార్పు అని చెప్పవచ్చు.

స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ లో కూడా అద్భుతమైన మార్పులు చేశారు. మనం స్క్రీన్ రికార్డ్ చేస్తున్నప్పుడు మన ముఖం కూడా కనిపించేలా సెల్ఫీ కెమెరాను ఆన్ చేసుకునే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవడానికి, మరియు రికార్డింగ్ పూర్తయిన వెంటనే అక్కడే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక ఫోన్లో మనం వాడిన 'రీసెంట్ యాప్స్' చూస్తున్నప్పుడు, అందులో ఏదైనా ఫోటో కనిపిస్తే దానిని లాంగ్ ప్రెస్ చేసి నేరుగా గ్యాలరీలోకి సేవ్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని కూడా ఈ ఆండ్రాయిడ్ 17 లో పొందుపరిచారు.

ఫోన్ సెట్టింగ్స్ లో ఏదైనా ఆప్షన్ ఎక్కడ ఉందో వెతుక్కోవడం కష్టంగా ఉంటే, దానికి పరిష్కారంగా 'ఆస్క్ పిక్సెల్' అనే కొత్త ఫీచర్ ను తెచ్చారు. ఇది మనం అడిగిన సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా గైడ్ చేస్తుంది. ఇక హోమ్ స్క్రీన్ మరింత అందంగా కనిపించడానికి యాప్స్ కింద పేర్లు లేకుండా దాచే (హైడ్ చేసే) ఆప్షన్ ను వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లో చేర్చారు. దీనితో పాటు స్ప్లిట్ స్క్రీన్ (రెండు యాప్స్ ఒకేసారి వాడటం) వాడుతున్నప్పుడు యాప్స్ స్క్రీన్ సైజును సులభంగా పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి మధ్యలో బాణాలు (ఆరోస్) లాంటి గుర్తులను కూడా ఏర్పాటు చేశారు.

గూగుల్ అసిస్టెంట్ కు సంబంధించి వాయిస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా వాల్యూమ్ కంట్రోల్ ను ఈ వెర్షన్ లో అందించారు. అలాగే గూగుల్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు పవర్ బటన్ నొక్కితే స్క్రీన్ డార్క్ మోడ్ లోకి మారిపోయి బ్యాటరీ ఆదా అయ్యేలా 'మినిమల్ మోడ్' ను ప్రవేశపెట్టారు. మన లొకేషన్ ను ఏదైనా యాప్ వాడుకుంటుంటే పైభాగంలో బ్లూ కలర్ ఐకాన్ ద్వారా హెచ్చరించడం, కొత్త యూజర్లు లాగిన్ అయినప్పుడు ఆటోమెటిక్ గా వైఫై కనెక్ట్ అవ్వడం మరియు డెవలపర్ ఆప్షన్స్ తో పనిలేకుండా సెట్టింగ్స్ నుంచే ఏ యాప్ కైనా డార్క్ మోడ్ సెట్ చేయడం లాంటి ఫీచర్లు ఆండ్రాయిడ్ 17 లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Tags

Be the first to react

Latest