Hindupur: హిందూపూర్లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభం!

Hindupur: సత్యసాయి జిల్లా హిందూపూర్లో యువ క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా సదుపాయాలు అందించే లక్ష్యంతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభమైంది. హిందూపూర్లోని ఎంజీఎం గ్రౌండ్లో రూ.2.64 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే, పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి, సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు కలిసి ప్రారంభించారు.

Hindupur
Hindupur

రూ.2.64 కోట్లతో నిర్మించిన ఆధునిక క్రీడా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. 

యువ క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి..

హిందూపూర్: సత్యసాయి జిల్లా హిందూపూర్లో యువ క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా సదుపాయాలు అందించే లక్ష్యంతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభమైంది. హిందూపూర్లోని ఎంజీఎం గ్రౌండ్లో రూ.2.64 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే, పద్మభూషణ్ పురస్కార గ్రహీత నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి, సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్ర నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించి పూర్తి చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ క్రీడా కేంద్రంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, కబడ్డీ, యోగా వంటి క్రీడల్లో శిక్షణ పొందేందుకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు ఒకే వేదికపై నాణ్యమైన శిక్షణ పొందే అవకాశం ఈ కేంద్రం ద్వారా కలుగుతుందని చెప్పారు.

హిందూపురం నియోజకవర్గానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసిన రవి నాయుడు, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజాసేవతో పాటు క్రీడల అభివృద్ధికి కూడా విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

క్రీడా వికాస కేంద్ర నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన శాప్ అధికారులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు కృషిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, శాప్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హిందూపూర్లో ప్రారంభమైన ఈ ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం జిల్లా యువతకు మెరుగైన క్రీడా శిక్షణ అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

Latest