LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Sports

Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!!

Kuldeep Yadav Wedding: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాతో కలిసి శనివారం ముస్సోరీలో వివాహం చేసుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత జరిగిన ఈ వేడుకకు చాహల్, రింకూ సింగ్ వంటి క్రికెటర్లు హాజరయ్యారు.

AndhraPravasi News Desk 2 min read
Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!!

ముస్సోరీ వేదికగా అంగరంగ వైభవంగా వేడుక

హాజరైన క్రికెట్ స్టార్లు

విశ్వవిజేత కావడం కోసమే పెళ్లి వాయిదా

Kuldeep Yadav Wedding: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్, 'చైనామన్' బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాతో కలిసి శనివారం ముస్సోరీలోని అందమైన పర్వత శ్రేణుల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కుల్దీప్, ఆ విజయం తర్వాత జరిగిన ఈ వివాహ వేడుకతో డబుల్ సెలబ్రేషన్‌లో మునిగిపోయాడు.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీలో ఉన్న 'వెల్కమ్‌హోటల్ ది సావోయ్'లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుక కోసం హోటల్‌ను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. శనివారం జరిగిన ప్రధాన వివాహ ఘట్టానికి కుల్దీప్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో, బాణసంచా వెలుగుల మధ్య కుల్దీప్, వంశిక చేతులు పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

ఈ పెళ్లి వేడుకకు టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో పాటు మాజీ క్రికెటర్ సురేష్ రైనా, స్పిన్ జోడి యుజ్వేంద్ర చాహల్ కూడా హాజరై సందడి చేశారు. "నా తమ్ముడు కొత్త జీవితం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది" అంటూ చాహల్  ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో క్రికెటర్లు డ్యాన్స్‌లతో దుమ్మురేపారు.

వాస్తవానికి కుల్దీప్, వంశికల వివాహం 2025 నవంబర్‌లోనే జరగాల్సి ఉంది. అయితే, 2026 టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాలని, దేశానికి ట్రోఫీ అందించాలనే లక్ష్యంతో కుల్దీప్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అనుకున్నట్లుగానే టీమ్ ఇండియా ఈ ఏడాది మార్చి 8న న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత కుల్దీప్ తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి పెళ్లి పీటలెక్కాడు.

కుల్దీప్, వంశిక ఇద్దరిదీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరం. కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉండే వీరిద్దరూ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. వంశిక ప్రస్తుతం ఎల్ఐసీ (LIC)లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత ఏడాది లక్నోలో వీరిద్దరి నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగింది. గత వారం కుల్దీప్ తండ్రి రామ సింగ్ యాదవ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి పెళ్లి పత్రికను అందించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న కుల్దీప్, త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం మైదానంలోకి దిగనున్నాడు. కొత్త జంటకు నెటిజన్లు, క్రికెట్ అభిమానులు  సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Be the first to react

More Coverage

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు త…

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇటీవల వచ్చిన విమర్శలు, సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వి…

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగియడంతో, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబ…