LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Sports

IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు (సీఎస్‌కే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, తొడ కండరాల గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

AndhraPravasi News Desk 1 min read
IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.!
  • చెపాక్ స్టేడియంలో విషాదం: కేకేఆర్‌తో మ్యాచ్‌లో గాయపడి టోర్నీకి దూరమైన ఖలీల్..
     
  • Sports: సీఎస్‌కే బౌలింగ్‌ అటాక్‌కు పెద్ద లోటు: ఖలీల్ అహ్మద్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు (సీఎస్‌కే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, తొడ కండరాల గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఖలీల్ ఇబ్బంది పడ్డాడు. పరుగు పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆగిపోయి, కుడి కాలును పట్టుకుని నొప్పితో విలవిలలాడాడు. తొలుత కండరాలు పట్టేయడమే అనుకున్నా, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఆ ఓవర్‌లోని మిగిలిన ఐదు బంతులను గుర్జప్‌నీత్ సింగ్ పూర్తి చేశాడు.

ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం ఖలీల్ తొడ కండరాల్లో చీలికలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అవసరమైతే అతనికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చని, ఫాస్ట్ బౌలర్‌కు ఇలాంటి గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ (పిక్క కండరాల గాయం), స్పెన్సర్ జాన్సన్ (వెన్నునొప్పి) సేవలను కోల్పోయిన సీఎస్‌కేకు ఖలీల్ దూరం కావడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుతం ఖలీల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముఖేశ్‌ చౌదరి, రైట్ ఆర్మ్ పేసర్ రామకృష్ణ ఘోష్ అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

Be the first to react

More Coverage

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు త…

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇటీవల వచ్చిన విమర్శలు, సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వి…

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగియడంతో, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబ…