T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Hardik Pandya: ఒకపక్క వెన్నునొప్పి, మరోపక్క రెండో పెళ్లి వార్తలు.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా హల్‌చల్! IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!

Indira Gandhi Stadium: విజయవాడ స్పోర్ట్స్ హబ్‌గా ఐజీఎంసీ స్టేడియం రూ.19 కోట్లతో అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి పనులు ప్రారంభం!

Indira Gandhi Stadium: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంను రూ.19 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నారు. సింథటిక్ ట్రాక్, అత్యాధునిక వసతులతో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు..

Published : 2026-04-08 18:05:00

Indira Gandhi Stadium Vijayawada: నగర నడిబొడ్డున ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి వసతులతో ఈ మైదానాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. బుధవారం స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులకు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనిమినీ రవినాయుడు, భరణి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

గత కొన్నేళ్లుగా సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న క్రీడాకారుల కష్టాలను తీరుస్తూ, కూటమి ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొత్తం 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా అథ్లెట్ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సింథటిక్ ట్రాక్ అత్యాధునిక ఫీల్డ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కేవలం సౌకర్యాలు పెంచడమే కాకుండా, విదేశీ స్టేడియాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిని సిద్ధం చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

శంకుస్థాపన అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "విజయవాడను క్రీడల కేంద్రంగా (స్పోర్ట్స్ హబ్) మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. మన రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే వారికి సరైన శిక్షణ, ఆధునిక వాతావరణం అవసరం. అందుకే ఈ స్టేడియంలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను కల్పిస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లు జరిగేలా చూస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా, క్రీడాకారులకు అవసరమైన ఇతర సాంకేతిక వసతులను కూడా మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా యువ క్రీడాకారులు బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సొంత నగరంలోనే ఉత్తమ శిక్షణ పొందే అవకాశం కలుగుతుంది. స్టేడియం లోపల డ్రైనేజీ వ్యవస్థ, ఫ్లడ్ లైట్లు, గ్యాలరీల మరమ్మతులపై కూడా దృష్టి సారించనున్నట్లు క్రీడా శాఖ అధికారులు వెల్లడించారు.

స్థానిక నేతలు కేశినేని శివనాథ్  గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, విజయవాడ నగరానికి ఈ స్టేడియం ఒక తలమానికం లాంటిదని, దీని అభివృద్ధి వల్ల వేలాది మంది క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా వారు అధికారులను కోరారు.

Spotlight

Read More →