IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!! IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!!

IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!!

IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసానికి క్రికెట్ ప్రపంచం ఫిదా అయింది. ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ, ఆ చిన్నారి ఆటగాడిని హార్దిక్ పాండ్యా దగ్గరకు పిలిచి అభినందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published : 2026-04-08 08:37:00

IPL 2026: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదడం విశేషం.

మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చూపిన క్రీడాస్ఫూర్తి అందరి మనసు గెలుచుకుంది. తన జట్టు ఓడిపోయినప్పటికీ, ఆ బాధను పక్కన పెట్టి కుర్రాడు వైభవ్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించాడు. మైదానంలో ప్రత్యర్థులైనా, బయట ఒక మంచి ఆటగాడిని గౌరవించడం హార్దిక్ గొప్పతనాన్ని చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైభవ్ బ్యాటింగ్ గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "15 ఏళ్ల వయసులో ఇంత భయం లేకుండా ఆడటం నిజంగా అద్భుతం. మ్యాచ్‌కు ముందు మేము అతని గురించి చాలా చర్చించుకున్నాం. అతను ఆడే షాట్లు, బ్యాటింగ్‌లో చూపిస్తున్న తెగువ చూస్తుంటే ముచ్చటేస్తోంది. భవిష్యత్తులో అతను ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం ఆ కుర్రాడికి పెద్ద బూస్ట్ అని చెప్పాలి.

ఇక ఆట విషయానికొస్తే, రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించారు. జైస్వాల్ 32 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి కేవలం 2.4 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కుకు చేర్చారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లు ఈ విధ్వంసాన్ని ఆపలేక చేతులెత్తేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తడబడింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ముంబై కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పోరాడినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 123 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాజస్థాన్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

Spotlight

Read More →