LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Sports

Vijayawada: విజయవాడలో ఘనంగా ప్రారంభమైన 2026 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు!

Vijayawada: రాష్ట్రంలో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు–2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు.

AndhraPravasi News Desk 1 min read
Vijayawada: విజయవాడలో ఘనంగా ప్రారంభమైన 2026 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు!

వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు..

విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు..

విజయవాడ: రాష్ట్రంలో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు–2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 423 మండలాల్లో 1,020 వేదికల వద్ద 1,389 శిబిరాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి మొత్తం 55 క్రీడాంశాల్లో నెల రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ, “విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి” అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ఈ శిబిరాల లక్ష్యమని చెప్పారు.

శిబిరాల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పౌష్టికాహారం కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. మంచి కోచ్‌లు, సరైన పరికరాలతో శిక్షణ ఇచ్చి, భవిష్యత్తులో రాష్ట్రానికి గౌరవం తెచ్చే క్రీడాకారులను తయారు చేయాలని శాప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, క్రీడల వైపు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Be the first to react

More Coverage

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై..

Virat Kohli: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు త…

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ!

DSC: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇటీవల వచ్చిన విమర్శలు, సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వి…

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే..

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగియడంతో, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబ…