Prawn Pakoda: నాన్ వెజ్ లవర్స్ కోసం అదిరిపోయే స్నాక్..! కరకరలాడే రొయ్యల పకోడీ! Kakarakaya Karam: ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం పొడి..! ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా! Prawn Pakoda: నాన్ వెజ్ లవర్స్ కోసం అదిరిపోయే స్నాక్..! కరకరలాడే రొయ్యల పకోడీ! Kakarakaya Karam: ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం పొడి..! ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా!

Watermelon Juice: పుచ్చకాయతో ఒకసారి ఇలా ట్రై చేయండి... మళ్ళీ మళ్ళీ కావాలంటారు!

Summer Drinks in Telugu : వేసవి తాపాన్ని తగ్గించి ఒంటికి చలువ చేసే టేస్టీ వాటర్ మెలన్ జ్యూస్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. పుచ్చకాయ ముక్కలు, పాలు, సబ్జా గింజలతో చేసే హెల్తీ డ్రింక్ రెసిపీ మీ కోసం

Published : 2026-03-03 08:41:00

Summer Drinks in Telugu: భానుడు భగభగమంటున్నాడు. బయట అడుగుపెట్టాలంటేనే జనం హడలిపోతున్నారు. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మార్కెట్లో దొరికే రంగురంగుల కూల్ డ్రింక్స్ కంటే, ఇంట్లోనే ఆరోగ్యకరమైన పద్ధతిలో చేసుకునే ఫ్రూట్ జ్యూస్‌లు ఎంతో మేలని  డాక్టర్లు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే పుచ్చకాయతో  అద్భుతమైన హెల్తీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

 తాజా పుచ్చకాయ ముక్కలు (రెండు కప్పులు)

 చక్కెర (రుచికి సరిపడా)

 పాలు (ఒకటిన్నర కప్పు)

 సబ్జా గింజలు (ఒక టేబుల్ స్పూన్)

 డ్రై ఫ్రూట్స్ (కాజు, బాదం ముక్కలు)

 రోజ్ సిరప్ (ఆప్షనల్)

ముందుగా  పుచ్చకాయను  చిన్న చిన్న ముక్కలుగా కోసి, అందులో విత్తనాలు లేకుండా చూసుకోవాలి. సుమారు రెండు కప్పుల ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఈ క్వాంటిటీ ముగ్గురికి సరిపోతుంది. ఒకవేళ పుచ్చకాయ బాగా తీపిగా ఉంటే రెండు స్పూన్ల చక్కెర సరిపోతుంది, లేదంటే మరో రెండు స్పూన్లు అదనంగా వేసుకోవచ్చు. మిక్సీలో వేసిన ముక్కలను ఎక్కడా గుజ్జు తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన జ్యూస్‌ను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి వడకట్టుకోవాలి.

ఇక ఈ జ్యూస్‌లో ఒకటిన్నర కప్పు పాలను పోయాలి. మీరు ప్యాకెట్ పాలు వాడుతుంటే నేరుగా కలిపేయవచ్చు, అదే గేదె పాలు అయితే కాచి చల్లార్చినవి వాడటం మంచిది. జ్యూస్ తయారు చేయడానికి 20 నిమిషాల ముందే నానబెట్టుకున్న సబ్జా గింజలను ఇందులో వేయాలి. ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

జ్యూస్ తాగేటప్పుడు క్రంచీగా తగలడానికి కొన్ని పుచ్చకాయ ముక్కలను, సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు పలుకులను జోడించాలి. చివరగా మరింత రిచ్ టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల 'రోజ్ సిరప్' కలిపితే, ఆ ఫ్లేవర్ జ్యూస్‌కి కొత్త కళను ఇస్తుంది.

ఈ జ్యూస్‌ను అలాగే తాగేయొచ్చు లేదా మరింత చిల్డ్‌గా కావాలనుకునే వారు ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేస్తే ఆ మజానే వేరు. అతి తక్కువ సమయంలో, ఇంట్లోని వస్తువులతోనే తయారయ్యే ఈ హెల్తీ డ్రింక్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. బయట దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్‌ జోలికి వెళ్లకుండా, ఇలాంటి నేచురల్ జ్యూస్‌లతో ఈ వేసవిని హాయిగా ఆస్వాదించండి…

Spotlight

Read More →