Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! kandipachadi: అమ్మమ్మల కాలం నాటి అదిరిపోయే కందిపచ్చడి... పక్కా కొలతలతో తయారీ విధానం! అచ్చమైన తెలుగు రుచి.. నోరూరించే టమాట కూటు.. అదిరిపోయే వేపుళ్ల కాంబినేషన్! ఇలా చేస్తే వదలరు.. Healthy Breakfast: కీళ్ల నొప్పులకు రాగి అల్పాహారంతో చెక్.. ఒక్క పిండితో రెండు రకాల టిఫిన్స్! Potato UlliKaram: నోరూరించే ఆంధ్ర స్టైల్ బంగాళదుంప ఉల్లికారం.. ఇలా చేస్తే రుచి అమోఘం! Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! KootuPodi: ఇంట్లోనే English ఘుమఘుమలాడే కూటు పొడి... పది నిమిషాల్లో తయారయ్యే సులభమైన రెసిపీ! Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! kandipachadi: అమ్మమ్మల కాలం నాటి అదిరిపోయే కందిపచ్చడి... పక్కా కొలతలతో తయారీ విధానం! అచ్చమైన తెలుగు రుచి.. నోరూరించే టమాట కూటు.. అదిరిపోయే వేపుళ్ల కాంబినేషన్! ఇలా చేస్తే వదలరు.. Healthy Breakfast: కీళ్ల నొప్పులకు రాగి అల్పాహారంతో చెక్.. ఒక్క పిండితో రెండు రకాల టిఫిన్స్! Potato UlliKaram: నోరూరించే ఆంధ్ర స్టైల్ బంగాళదుంప ఉల్లికారం.. ఇలా చేస్తే రుచి అమోఘం! Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! KootuPodi: ఇంట్లోనే English ఘుమఘుమలాడే కూటు పొడి... పది నిమిషాల్లో తయారయ్యే సులభమైన రెసిపీ! Mango Pickle: ఎండలో పెట్టక్కర్లేదు.. ఐదే నిమిషాల్లో నమూనా ఊరగాయ! తయారీ విధానం... Prawns Fry Recipe: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ రొయ్యల ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి! Fish Curry: చేపల పులుసులో ఈ చిన్న మార్పు చేయండి - రుచి రెట్టింపు! మెచ్చుకునేలా వండటం ఇక చాలా ఈజీ.!

Punjabi Chole Masala Recipe: అదిరిపోయే 'రెస్టారెంట్ స్టైల్' పంజాబీ చోలే మసాలా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Punjabi Chole Masala Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో పంజాబీ చోలే మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో శనగలకు మంచి రంగు రావాలన్నా, గ్రేవీ చిక్కగా రుచిగా ఉండాలన్నా పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ తయారీ విధానం మీకోసం..

Published : 2026-03-08 12:50:00

Punjabi Chole Masala Recipe: సౌత్ ఇండియన్ ఇళ్లలో పండుగైనా, ఆదివారమైనా ఎక్కువగా వినిపించే పేరు చికెన్  మటన్ ఫిష్ రొయ్యలే అయితే ఒక్కసారైనా చోలే మసాలా ను ఇలా ట్రై చేయండి వేడివేడి పూరీతో  పులావ్‌తో ఈ కమ్మని మసాలా కూర తింటుంటే ఆ రుచే వేరు. అయితే, చాలామందికి రెస్టారెంట్‌లో వచ్చే ఆ రంగు, రుచి ఇంట్లో రావడం లేదని  ఆ చింత ఇక అక్కర్లేదు! కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మీ వంటింట్లోనే అచ్చం హోటల్ రుచితో పంజాబీ చోలే మసాలాను సిద్ధం చేయవచ్చు.

సీక్రెట్ ఏంటంటే

పంజాబీ చోలే మసాలా ప్రత్యేకత అంతా ఆ గ్రేవీ రంగు  చిక్కదనంలోనే ఉంటుంది. సాధారణంగా ఇంట్లో చేసే చోలే లేత రంగులో ఉంటాయి, కానీ రెస్టారెంట్లలో అవి ముదురు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. దీని కోసం ఉడికించేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను వేయించే విధానం కూడా ఈ వంటకం రుచిని అమాంతం పెంచేస్తుంది.

తయారీకి కావాల్సిన వస్తువులు:

 శనగలు  - 1 కప్పు

ఉల్లిపాయలు - 3 (పొడవుగా కోసినవి)

 టమోటా ప్యూరీ - 2 కప్పులు

 పెరుగు - అర కప్పు

 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

 హోల్ స్పైసెస్ (యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు)

 టీ పొడి లేదా టీ బ్యాగ్స్

 మసాలాలు: కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చోలే మసాలా, ఉప్పు, నూనె.

తయారీ విధానం:

ముందుగా శనగలను రాత్రంతా (కనీసం 7 గంటలు) నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో శనగలు వేసి, అందులో కొద్దిగా ఉప్పు, ఒక బిర్యానీ ఆకు, పెద్ద యాలకులు వేయాలి. హోటల్ స్టైల్ రంగు కోసం ఒక చిన్న తెల్లని బట్టలో కొద్దిగా టీ పొడిని మూటగట్టి అందులో వేయండి (లేదా టీ బ్యాగ్ వాడొచ్చు). అలాగే ఒకటి రెండు ఎండిన ఉసిరి ముక్కలు వేస్తే మంచి రంగు వస్తుంది. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

 ఉల్లిపాయల ట్రిక్:

మరో పక్క బాణలిలో నూనె వేసి, పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను దోరగా, ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టకుండా చేత్తోనే కొంచెం నలిపి పక్కన పెట్టుకోండి. ఇదే ఈ కూరకు మంచి టెక్స్చర్‌ని ఇస్తుంది.

 గ్రేవీ తయారీ:

అదే బాణలిలో కొద్దిగా జీలకర్ర వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత టమోటా ప్యూరీ వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు మంట తగ్గించి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఇందులోనే అర కప్పు పెరుగు కలిపితే గ్రేవీకి మంచి రిచ్‌నెస్ వస్తుంది.

మసాలా వేగిన తర్వాత, ఉడికించి పెట్టుకున్న శనగలను (టీ బ్యాగ్ తీసేసి) నీళ్లతో సహా కలపాలి. కూర చిక్కబడటం కోసం గరిటెతో కొన్ని శనగలను మెత్తగా నలపాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కస్తూరి మేతి, గరం మసాలా, కొద్దిగా  చల్లి రెండు నిమిషాలు ఉడికించాలి. పైన కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలతో గార్నిష్ చేస్తే నోరూరించే పంజాబీ చోలే మసాలా రెడీ..

Spotlight

Read More →