Perugu Garelu Recipe: పిల్లలు మెచ్చే టేస్టీ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా 'పెరుగు గారెలు' ఇలా తయారు చేసుకోండి.!! Chinthakaya Chepala Pulusu: పచ్చి చింతకాయల చేపల పులుసు ఇలా చేస్తే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేదు.. నూనె అవసరం లేదు... రుచికరమైన 'పొలం పచ్చడి'! Watermelon Dosa: పుచ్చకాయ తొక్కతో దోశలా? వినడానికి వింతగా ఉన్నా.. తింటే వదలరు! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Prawn Pakoda: నాన్ వెజ్ లవర్స్ కోసం అదిరిపోయే స్నాక్..! కరకరలాడే రొయ్యల పకోడీ! Kakarakaya Karam: ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం పొడి..! ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Perugu Garelu Recipe: పిల్లలు మెచ్చే టేస్టీ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా 'పెరుగు గారెలు' ఇలా తయారు చేసుకోండి.!! Chinthakaya Chepala Pulusu: పచ్చి చింతకాయల చేపల పులుసు ఇలా చేస్తే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేదు.. నూనె అవసరం లేదు... రుచికరమైన 'పొలం పచ్చడి'! Watermelon Dosa: పుచ్చకాయ తొక్కతో దోశలా? వినడానికి వింతగా ఉన్నా.. తింటే వదలరు! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Prawn Pakoda: నాన్ వెజ్ లవర్స్ కోసం అదిరిపోయే స్నాక్..! కరకరలాడే రొయ్యల పకోడీ! Kakarakaya Karam: ఆంధ్ర స్టైల్ కాకరకాయ కారం పొడి..! ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం!

Perugu Garelu Recipe: పిల్లలు మెచ్చే టేస్టీ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా 'పెరుగు గారెలు' ఇలా తయారు చేసుకోండి.!!

Perugu Garelu Recipe: సాయంత్రం వేళ రొటీన్ గా కాకుండా పెరుగు గారెలను ట్రై చేయండి.. మినపప్పు, పెరుగుతో ఎంతో రుచికరంగా, సాఫ్ట్‌గా వచ్చే పెరుగు గారెలు తయారీ విధానం పక్కా కొలతలతో, సింపుల్ స్టెప్స్‌తో మీ ఇంట్లోనే హోటల్ రుచిని ఆస్వాదించండి

Published : 2026-03-19 14:55:00

Perugu Garelu Recipe: వేడివేడిగా సాయంత్రం వేళ బయట బండ్ల మీద వేడివేడి  పునుగులు, బజ్జీలు, సమోసాలు, చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే ఎప్పుడూ తినే  సాదాసీదాగా కాకుండా, కాస్త కొత్తగా ‘పెరుగు గారెలు ’ ట్రై చేస్తే ఆ మజాయే వేరు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. హోటల్ స్టైల్‌లో సాఫ్ట్‌గా ఉండే పెరుగు గారెలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన  పదార్థాలు

ముందుగా దీనికి అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. రెండు కప్పుల మినపప్పు, తగినంత అల్లం ముక్కలు, ఆరు పచ్చిమిర్చి, ఒక కప్పు పెరుగు, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి  కరివేపాకు  కొత్తిమీర సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం ఇలా..

మొదటగా మినపప్పును శుభ్రంగా కడిగి కనీసం నాలుగు గంటల నుంచి  ఆరు గంటలు పాటు నానబెట్టాలి. పప్పు బాగా నానిన తర్వాత అందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా  గ్రైండర్  చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోయాలి. నూనె వేడెక్కాక పిండిని చిన్న చిన్న  గారెలు వేసి రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించాలి. ఇలా వేయించిన పునుగులను నేరుగా ప్లేట్‌లోకి తీసుకోకుండా పెరుగు తాలింపులో  వేయడం వల్ల   గారెలు మెత్తగా మారి పెరుగును బాగా పీల్చుకుంటాయి.

అసలైన రుచి తాలింపులోనే..

మరోపక్క ఒక గిన్నెలో పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలకాలి. అందులో కొద్దిగా నీళ్లు, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకుతో తాలింపు వేయాలి. ఈ తాలింపును పెరుగులో కలిపి, దాంతో పాటు  కొత్తిమీర తురుములను కూడా చేర్చాలి.  గారెలను ఈ పెరుగు మిశ్రమంలో వేయాలి. ఒక  15 నిమిషాలు  పాటు వీటిని అలాగే వదిలేస్తే  గారెలకు పెరుగు ఫ్లేవర్ బాగా పడుతుంది. అంతే.. ఎంతో రుచికరమైన పెరుగు  గారెలు రెడీ! వీటిని సర్వ్ చేసే ముందు మరికాస్త క్యారెట్ తురుము వేసుకుంటే చూడటానికి బాగుండటమే కాకుండా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.

Spotlight

Read More →