LIVE
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి వేచి ఉన్న భక్తులు!  •  Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!  •  Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!  •  Yoga: సంజీవనితో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.. సీఎం చంద్రబాబు!  •  Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!  •  Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Nimmala Ramanaidu: రెండేళ్ల కూటమి పాలనకు ప్రజల బ్రహ్మరథం.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు!  •  President: రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన!  •  Amarnath: అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 63 మంది అధికారుల నియామకం!  • 
Politics

Minister Savita: 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. నాలుగు ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్ల ప్రారంభం!

Minister Savita Meeting About Womens Day: ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 ఎంవోయూలు చేసుకోనున…

AndhraPravasi News Desk 2 min read
Minister Savita: 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. నాలుగు ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్ల ప్రారంభం!
  • మహిళల ఉపాధి కల్పనే లక్ష్యం 36 ఎంవోయూలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు!
     
  • మహిళా లబ్ధిదారులకు వాహనాల అందజేత: మంత్రి సవిత

Minister Savita Meeting About Womens Day: ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 ఎంవోయూలు చేసుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, చేనేత, జౌళి శాఖ, సీఆర్డీయే, గుంటూరు జిల్లా అధికారులతో మంత్రులు సవిత, సంధ్యారాణి సమావేశం నిర్వహించారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరు కానున్నారన్నారు. 

ఈ సందర్భంగా మహిళలకు మేలు కలిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దే క్రమంలో పలు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సీఎం సమక్షంలో 36 ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలతో ల్యాప్ టాప్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, రెడీ మేడ్ దుస్తుల తయారీకి శిక్షణివ్వడదానికి సెర్ప్ తో ఆప్కో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా నాలుగు ఎన్ఆర్ఎల్ఎం  క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఎమ్మిగనూరు(కర్నూలు), చీరాల(బాపట్ల), రాజాం(విజయనగరం), పొందూరు(శ్రీకాకుళం)లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. 

మహిళా దినోత్స వేడుకల సందర్భంగా 23 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్వాకా మహిళా సంఘాలకు రుణాల అందజేయనున్నామన్నారు.  మిల్లెట్ కార్ట్ లు 2, ఎగ్ కార్ట్ లు 5, రైతు బజారు వ్యాన్ 1, బొలెరో వాహనాలు రెండు, ఆటోలు 5, ట్రాక్టర్లు 5, ర్యాపిడో ద్విచక్ర వాహనాలు 5 మహిళ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబునాయుడు అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు, ఫ్రీ బస్, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు అమలు చేశామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖా రాణి,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్య కుమారి, సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ, గుంటూరు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలకమైన అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహ…

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…