TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు TTD Updates: 6 అంతస్తుల భవనం.. అద్భుత వసతులు: టీటీడీ జేఈవో క్షేత్రస్థాయి పరిశీలన.! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! Parliament: 2029 లక్ష్యంగా కేంద్రం మాస్టర్ ప్లాన్.. జనగణనతో సంబంధం లేకుండా మహిళా కోటా అమలు! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Constitution Amendment Bill: రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో రచ్చ.. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు! Earthquake: ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి పరుగులు తీసిన జనం! Automatic Mist Spraying: చంద్రబాబు చల్లని ఐడియా... ఏపీ రోడ్లపై 'ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్'...! Chandrababu: చంద్రబాబు నేటి షెడ్యూల్... పార్టీ కార్యాలయానికి సీఎం, అనంతరం కీలక సమీక్ష! AP Investments: ఏపీలో మరో భారీ పరిశ్రమ... రూ.8,175 కోట్లతో..!! ఆ జిల్లాకు మహర్దశ! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త... మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్.! ఒక్కొక్కరికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్!

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సిద్ధమైంది.అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత డిక్కీ బాబును కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

Published : 2026-02-21 13:26:00

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు భారీ షాక్…

ఎల్ఐసీ నోటీసులతో కదిలిన డొంక..

వైసీపీ నేత డిక్కీ బాబును అరెస్ట్ చేసిన కదిరి పోలీసులు…

YSRCP: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సిద్ధమైంది. బుట్టా కుటుంబం తమ వ్యాపార అవసరాల కోసం ఎల్ఐసీ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వడ్డీతో కలిపి మొత్తం బకాయిలు రూ. 782 కోట్లకు చేరుకున్నాయి. రుణం చెల్లించాలని సంస్థ పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆస్తుల జప్తికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ బకాయిల వసూలు కోసం బుట్టా ఫ్యామిలీ బ్యాంకు వద్ద తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని విలువైన స్థలాలను వేలం వేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో, ఇంత భారీ స్థాయిలో ఆస్తుల వేలం ప్రకటన రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత డిక్కీ బాబును కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. తలుపుల మండల వైసీపీ కన్వీనర్‍గా బాధ్యతలు నిర్వహిస్తున్న డిక్కీ బాబు, అదృష్టం కలిసి వస్తుందంటూ అమాయకులను నమ్మించి రైస్ పుల్లింగ్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. తాజాగా కడపకు చెందిన ఒక వ్యక్తిని నమ్మించి సుమారు రూ. 30 లక్షలు కాజేయడంతో, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

డిక్కీ బాబు మోసాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ వరకు విస్తరించినట్లు ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది. పలువురు ప్రముఖులను కూడా ఈ రైస్ పుల్లింగ్ మాయాజాలంలో చిక్కులు వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ మోసాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Spotlight

Read More →