⚡ BREAKING
Politics

DSC: డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలి.. జగన్‌కు ఎంపీ చింతకాయల విజయ్ సవాల్!

DSC: డీఎస్సీ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించాలని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు.

Chintakayala Vijay
Chintakayala Vijay

లోకేష్ చేసిన సవాల్‌కు ఐదు రోజులైనా స్పందన లేదు: విజయ్..

ఆరోపణలు చేసిన వారే చర్చకు రావాలి.. జగన్‌పై టీడీపీ నేతల విమర్శలు..

అమరావతి: డీఎస్సీ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ చేసిన బహిరంగ చర్చ సవాల్‌ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించాలని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు.

డీఎస్సీపై మంత్రి లోకేష్ తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో నిలబడి జగన్‌కు బహిరంగ చర్చకు సవాల్ చేశారని, అయితే సవాల్ చేసి ఐదు రోజులు గడిచినా చర్చకు రాలేదని విజయ్ విమర్శించారు.

రికార్డెడ్ ప్రెస్‌మీట్ ద్వారా మంత్రి లోకేష్‌పై ఆరోపణలు చేసింది జగన్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వ్యక్తి వాటిపై చర్చకు కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు.

మంత్రి హోదాలో లోకేష్ ఎలాంటి భయం లేకుండా, నిజాయితీతో బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని విజయ్ పేర్కొన్నారు. అయితే జగన్ ఎందుకు చర్చకు రావడం లేదని ప్రశ్నించారు.

డీఎస్సీ విషయంలో చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, సవాల్ స్వీకరించి ప్రజల ముందుకు రావాలని విజయ్ అన్నారు. ఈ అంశానికి కులం రంగు ఎందుకు పూశారో కూడా జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ చేసిన ఆరోపణలు తప్పని తేలితే, అవి ఫేక్ అని అంగీకరించి ప్రజలకు, యువతకు, అలాగే 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని విజయ్ సూచించారు.

డీఎస్సీ అంశంపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే బహిరంగ చర్చ ఒక్కటే మార్గమని, ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా వాటిని నిరూపించే బాధ్యత కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags

Be the first to react

More Coverage