LIVE
Singapore: సింగపూర్‌లో ఘనంగా 'మీట్ & గ్రీట్' – ప్రవాసాంధ్రులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆత్మీయ భేటీ!  •  Home Made Foods: అమ్మమ్మల కాలం నాటి యూషం... కారం, పచ్చిమిర్చి లేకుండానే కమ్మటి వంటకం!!  •  SIR 2026: మీ మొబైల్‌లోనే ఓటరు ఎన్యుమరేషన్ చేసుకోండిలా... పూర్తి వివరాలు!  •  Gold Price Today: ఆభరణాల ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..!  •  Basavatarakam Hospital: క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం.. 25 ఏళ్ల సేవలో బసవతారకం ఆస్పత్రి!  •  Cyber Security: డిజిటల్ దొంగల నుంచి మీ డబ్బు సేఫ్ గా ఉండాలా? ఈ 5 సెట్టింగ్స్ వెంటనే మార్చేయండి!  •  AP CRDA: అమరావతిలో ఆర్బీఐ బిగ్ ప్లాన్... మూడు ఎకరాల భూమి అప్పగించిన ఏపీసీఆర్డీఏ!  •  Pawan Kalyan: భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగం.. పవన్ కల్యాణ్ యోగా దినోత్సవ పోస్ట్ నెట్టింట వైరల్!  •  Amaravati Bank Street: అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్.. 13 భారీ బ్యాంకులతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ షురూ!  •  Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... ఆ మూడు గంటలే కీలకం!!  • 
⚡ BREAKING
Environment

Weather: ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచనలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Weather
Weather

ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. జాగ్రత్తలు పాటించాలని సూచన..

రాయలసీమపై ఆవర్తనం ప్రభావం.. ఏపీలో వర్షాలకు అవకాశం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం ఏర్పడి, పలుచోట్ల చెదురుమదురు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోమవారం (జూన్ 22) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

చెట్ల కింద నిలబడకూడదు, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదు, గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలి. వర్షపు సమయంలో బయటకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అప్రమత్తంగా వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

Tags

Be the first to react

More Coverage