LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Godavari Pushkaralu: పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం!

Godavari Pushkaralu: మంత్రి కందుల దుర్గేష్ చొరవతో సమిశ్రగూడెం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి రూ. 1.25 కోట్ల నిధులు మంజూరు

AndhraPravasi News Desk 1 min read
Godavari Pushkaralu: పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం!
  • గోదావరి పుష్కరాలు - 2027 నేపథ్యంలో పరిపాలన అనుమతులు జారీ చేసిన దేవాదాయ శాఖ..
     
  • 4-5 నెలల ముందే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా..

Godavari Pushkaralu: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు  కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో నిడదవోలు నియోజకవర్ నిడదవోలు రూరల్ మండలంలోని సమిశ్రగూడెం శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి మార్గం సుగమమైంది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఉమ్మడి ప్రయోజన నిధి('కామన్ గుడ్స్ ఫండ్') క్రింద ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం రూ. 1.25 కోట్ల నిధులను మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది.

పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు:
రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో దేశవ్యాప్తంగా భక్తులు రాజమహేంద్రవరం మరియు పరిసర ప్రాంతాల్లోని పవిత్ర గోదావరి తీరానికి తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు స్నానం ఆచరించిన అనంతరం నదీ తీరంలోని పురాతన దేవాలయాలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దేవాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికల ఆధారంగా, అత్యంత ప్రాధాన్యత కలిగిన సమిశ్రగూడెం ఆలయ పునరుద్ధరణ మరియు ఫేస్‌లిఫ్ట్ పనుల కోసం మంత్రి కందుల దుర్గేష్  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు.

సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం:
నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ ప్రజలు మంత్రి దుర్గేష్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. "పుష్కరాల నాటికి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా ఆలయ రూపురేఖలు మార్చడమే మా లక్ష్యం. నిర్మాణ పనులను పుష్కరాల కంటే 4-5 నెలల ముందే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి" అని ఆదేశించారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…