LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

AP Revenue Department: మాజీ మంత్రి బుగ్గనపై విరుచుకుపడ్డ మంత్రి మండిపల్లి.. గత వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం..!

AP Revenue Department: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసి, రైతుల భూములను కబ్జా చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబుపై బుగ్గన చేసిన ఆరోపణలను ఖండిస్తూ, భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

AndhraPravasi News Desk 2 min read
AP Revenue Department: మాజీ మంత్రి బుగ్గనపై విరుచుకుపడ్డ మంత్రి మండిపల్లి.. గత వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం..!

AP Revenue Department: గత ప్రభుత్వ హయాంలో భూ పరిపాలనను అస్తవ్యస్తం చేసి, రైతుల పొట్టగొట్టిన వారే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వైసీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.

అస్తవ్యస్తమైన రెవెన్యూ వ్యవస్థ

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని మంత్రి మండిపల్లి విమర్శించారు. రైతుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, భూ రికార్డులను తారుమారు చేసి వేల ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. అప్పట్లో జరిగిన భూ అక్రమాల వల్ల నేడు సామాన్య రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

భయం నుండే ఆరోపణలు

తమ హయాంలో చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి నాయకులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని మంత్రి పేర్కొన్నారు. "నేరం చేసిన వాడికి ఆ భయం ఉండటం సహజం, అందుకే ఉనికి కాపాడుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. భూ ఆక్రమణలు ఎక్కడ జరిగినా, అవి ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు.

రైతుల హక్కులే మా ప్రాధాన్యత

ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. రీ-సర్వే పేరుతో జరిగిన గందరగోళాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

కఠిన చర్యలు తప్పవు

రాష్ట్రంలో ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగినట్లు ఆధారాలతో నిరూపితమైతే, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి మండిపల్లి చెప్పారు. వ్యవస్థలను పారదర్శకంగా మార్చడమే తమ లక్ష్యమని, సామాన్యుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విపక్షాలు చేసే అనవసర విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా అర్థరహితమైన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…