LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Nara Lokesh: మండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్.. దేవుడంటే మా కుటుంబానికి..

Nara Lokesg Comments On YCP: దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది. గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: మండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్.. దేవుడంటే మా కుటుంబానికి..
  • గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం..
     
  • కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలి, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు..

Nara Lokesg Comments On YCP: దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది. గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. నెయ్యి కల్తీ అంశంపై శాసనమండలిలో చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ హెరిటేజ్ డెయిరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో సభకు రావాలి. గత పదేళ్లుగా మా బాబు పుట్టినరోజు మార్చి 21 తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారు. టెండర్ లో ఎల్-3 వస్తే రాదు.. ఎల్-1 వారికి మాత్రమే వస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. లడ్డూలో కల్తీ అంశం తప్ప వైసీపీ సభ్యులు అన్నీ మాట్లాడతారు. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ లో కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఇప్పుడు నెయ్యి మార్కెట్ ధర పెరిగింది. 

కల్తీ చేసి రూ.300కి నెయ్యి సప్లై చేయమంటారా? వైసీపీ కల్తీ చేసినట్లు చేయమంటారా? మార్కెట్ ప్రైస్ ఎంతుందో ఈ రోజు కామన్ సెన్స్ తో గూగుల్ లో చెక్ చేసుకోవచ్చు. కావాలని ఆరోపణలు చేస్తున్నారు. దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం. మాకు రైట్ ఉన్నా తిరుమలలో ఏనాడూ ముఖద్వారం నుంచి వెళ్లలేదు. క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లిన ఘనత మాది. మీ నాయకుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ పై కనీసం సంతకం పెట్టలేదు. మీరా మాట్లాడేది అంటూ నిలదీశారు. కల్తీ జరగలేదని చెప్పడానికి సిగ్గుండాలని, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడని మండిపడ్డారు. 

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…