LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Katranipadu Village: 60 ఏళ్ల కట్రానిపాడు కష్టం తీరింది.. రూ. 55 లక్షల ఆదా.. NRI సహకారంతో వినూత్నంగా స్లూయిస్ గేట్ల ఏర్పాటు!

Katranipadu Village: ఏలూరు జిల్లా కట్రానిపాడు గ్రామంలో 60 ఏళ్లుగా వేధిస్తున్న కొండవాగు సమస్యకు అధికారులు, ప్రజాప్రతినిధులు వినూత్న పరిష్కారం చూపారు. పట్టిసీమ స్లూయిస్ గేట్లను వినియోగించి రూ. 55 లక్షల ప్రజాధనాన్ని ఆదా చేస్తూ కల్వర్టులు ఏర్పాటు చేశారు.

AndhraPravasi News Desk 2 min read
Katranipadu Village: 60 ఏళ్ల కట్రానిపాడు కష్టం తీరింది.. రూ. 55 లక్షల ఆదా.. NRI సహకారంతో వినూత్నంగా స్లూయిస్ గేట్ల ఏర్పాటు!

Eluru District News: ఏలూరు జిల్లాలోని కట్రానిపాడు గ్రామం ఆ ఊరి పేరు వింటేనే వర్షాకాలంలో అక్కడి జనం వణికిపోయేవారు. గడిచిన అరవై ఏళ్లుగా ఆ గ్రామస్తులు ఒకే సమస్యతో సహవాసం చేస్తున్నారు. వాన పడితే చాలు, పక్కనే ఉన్న కొండవాగు ఉప్పొంగి గ్రామాన్ని చుట్టుముట్టేది. రోడ్లన్నీ చెరువుల్లా మారి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు పండించిన పంటను అమ్ముకోవాలన్నా ఆ వాగు దాటడం ప్రాణసంకటంగా ఉండేది. ఇక ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లడం గగనమయ్యేది.

అధికారుల చొరవ.. నేతల అండ

దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులు గట్టిగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధతో మరియు ఎన్నారై మురళి రాపార్ల సహకారంతో ఇది సాధ్యం అయ్యింది. పట్టిసీమ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న స్లూయిస్ గేట్లను ఇక్కడ వినియోగించుకోవాలని ఒక వినూత్న ఆలోచన చేశారు. దీనికి ప్రభుత్వం నుండి అనుమతులు రావడంతో పనులు వేగవంతమయ్యాయి.

రూ. 55 లక్షల ప్రజా ధనం ఆదా

సాధారణంగా అక్కడ కొత్తగా కల్వర్టులు నిర్మించాలంటే భారీగా ఖర్చవుతుంది. కానీ పట్టిసీమ నుంచి తెచ్చిన స్లూయిస్ గేట్లను కల్వర్టులు అవసరమైన నాలుగు కీలక ప్రాంతాల్లో అమర్చారు. దీనివల్ల దాదాపు రూ. 55 లక్షల వరకు ప్రజా ధనం ఆదా అయ్యింది. పాత సామాగ్రిని ఇలా ప్రత్యామ్నాయంగా వాడి సమస్యను పరిష్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ అధికారులు కూడా ఈ పద్ధతిని సమర్థంగా అమలు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు.

చేయూతనిచ్చిన దాతలు.. గ్రామస్తుల కృతజ్ఞతలు

ఈ భారీ స్లూయిస్ గేట్లను బాలివే నుంచి గ్రామానికి తరలించడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో ఎన్నారై మురళి రాపర్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించి రవాణా ఇబ్బందులను తొలగించారు. అలాగే బొమ్మకంటి శ్యామలరావు తన అనుభవంతో సరైన మార్గదర్శకత్వం చేయగా, రాపర్ల ప్రతాప్ పనుల పర్యవేక్షణలో తోడ్పడ్డారు. వీరి ఉమ్మడి ఆలోచన, శ్రమ మరియు సహకారంతో ఇన్నేళ్ల సమస్యకు ఇప్పుడు తెరపడిందని గ్రామస్తులు ఆనందంగా చెబుతున్నారు. తమ కష్టాన్ని గుర్తించి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఊరి జనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదే విధంగా ఎన్నారై రాపార్ల మురళి చేసిన సహకరనికి పలువురు ఎన్నారైలు ప్రసంసిస్తూ పది మందికి స్పూర్తిదాయకం అయ్యారని కొనియాడారు. 

ఊపిరి పీల్చుకున్న కట్రానిపాడు

ప్రస్తుతం ఆ నాలుగు ప్రాంతాల్లో స్లూయిస్ గేట్ల ఏర్పాటు పూర్తి కావడంతో వాగు నీరు రోడ్లపైకి రాకుండా సాఫీగా వెళ్లే మార్గం ఏర్పడింది. "ఇప్పుడు మా పిల్లలు భయం లేకుండా బడికి వెళ్తున్నారు. అత్యవసరమైతే ఆసుపత్రికి వెళ్లే దారి దొరికింది" అని స్థానికులు సంబరపడుతున్నారు. అరవై ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడమే కాకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేస్తూ చేసిన ఈ ప్రయత్నం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…