LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

Ration Card News: వేసవి కానుక.. రేషన్ లబ్ధిదారులకు అదిరిపోయే తీపి కబురు చెప్పిన ప్రభుత్వం!

PDS Supply Updates: ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను కోరింది.

AndhraPravasi News Desk 1 min read
Ration Card News: వేసవి కానుక.. రేషన్ లబ్ధిదారులకు అదిరిపోయే తీపి కబురు చెప్పిన ప్రభుత్వం!

PDS Supply Updates: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు పదే పదే రేషన్ షాపుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకేసారి మూడు నెలల కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా ఏ నెలకు సంబంధించిన బియ్యాన్ని ఆ నెలలోనే పంపిణీ చేస్తారు. అయితే, ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, సామాన్యులు ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండాలని కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్, మే  జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారుల అకౌంట్‌లోకి జమ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు దారులకు 'సన్నబియ్యం' పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో, ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఏప్రిల్ నెలలోనే ఏకంగా 18 కిలోల బియ్యం అందే అవకాశం ఉంది. దీనివల్ల నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.

మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని, డీలర్లకు కూడా పని భారం తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ.. కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాగే పంపిణీ చేసినప్పుడు సర్వర్లు మొరాయించాయి. ఒక్కో కార్డుపై మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం, సర్వర్ స్లోగా ఉండటం వల్ల ఒక్కో కుటుంబానికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోంది. దీనికి తోడు, అంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం తమ షాపుల్లో లేదని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…