LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Politics

AP Development Growth: చంద్రబాబు విజన్‌కు అందరూ అండగా ఉండాలి.. 11.75 శాతం వృద్ధి రేటే మన లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..!!

AP Development Growth: గత వైసీపీ ప్రభుత్వం చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పుల వల్ల రాష్ట్రం ఎలా దెబ్బతిన్నదో వివరిస్తూ, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గణాంకాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు

AndhraPravasi News Desk 2 min read
AP Development Growth: చంద్రబాబు విజన్‌కు అందరూ అండగా ఉండాలి.. 11.75 శాతం వృద్ధి రేటే మన లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..!!

AP Development Growth: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే, అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసి రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేశారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే   రాష్ట్ర ప్రగతిని మళ్ళీ పట్టాలెక్కించేందుకు నీటిపారుదల, రోడ్లు భవనాలు వంటి కీలక శాఖల కోసం ఇప్పటికే 37 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని పవన్ కల్యాణ్ వివరించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వారు పక్కదారి పట్టించారని పవన్ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పనుల విషయంలో గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 610 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే 3,753 కోట్ల రూపాయలు వెచ్చించిందని గణాంకాలతో సహా వివరించారు. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

రోడ్ల నిర్మాణ రంగంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 854 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేశారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల పనులను పూర్తి చేసిందని ఆయన గర్వంగా ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడిందని, ఆ గాడి తప్పిన వ్యవస్థలను బాగు చేసేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఈ కూటమి ఏర్పాటు కోసం తాను ఎంతో శ్రమించానని, ఈ బంధం ఇలాగే బలంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం గతంలో 11.75 శాతం వృద్ధి రేటును సాధించిందని, ఇప్పుడు కూడా అదే స్థాయి అభివృద్ధిని సాధించేందుకు అందరూ ఆయనకు అండగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు. కూటమిలోని నాయకులందరూ ఒకే తాటిపై ఉండి, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వం న్యాయశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కోర్టు విచారణల ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను జోడించి ఆన్‌లైన్ విధానాన్ని మరింతగా పెంచాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలోపారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…