Pawan Kalyan: జనసేన ఆవిర్భావ వేడుకల్లో కీలక మార్పు.. పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం!
Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేసినట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రస్థాయి వేడుకల్ని రద్దు చేశారు.
- జనసైనికులకు కీలక సూచన: రాష్ట్ర స్థాయి వేడుకల రద్దు.. స్థానికంగానే ఉత్సవాలు!
- కార్యకర్తల ఉత్సాహానికి బ్రేక్ వద్దు.. కానీ వడగాల్పులు జాగ్రత్త: జనసేనాని ఆదేశం..
Pawan Kalyan: జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 14న పిఠాపురంలో తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేసినట్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రస్థాయి వేడుకల్ని రద్దు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడికక్కడ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈసారి రాష్ట్ర స్థాయిలో పిఠాపురంలో నిర్వహించాలని తొలుత భావించారు.
అయితే వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయనే నివేదికల్ని పరిగణనలోకి తీసుకొని.. అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా కాకుండా జిల్లా, నగర, మండల కేంద్రాల్లో నిర్వహించి కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జన సైనికులకి, వీర మహిళలకు, జనసేన నాయకులకు పండగ లాంటి రోజైన మార్చి 14న పార్టీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Be the first to react