Housing Scheme: ఏపీలో పేదలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! అప్పుడే ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

2026-01-08 10:30:00
Mega Project: కేంద్రం గ్రీన్ సిగ్నల్... రెండు రాష్ట్రాలను కలిపే మెగా ప్రాజెక్ట్! రూ.816 కోట్లతో...

పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్‌ 2.0 (PMAY-G 2.0) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన గ్రామీణ పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. వచ్చే నెల నుంచి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!

ఈ పథకానికి గతేడాది డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 60 వేల మందికి పైగా అప్లై చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేలు (Field Level Survey) నిర్వహిస్తున్నారు. ఈ పరిశీలనల ఆధారంగా తుది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నారు.

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాయి. సొంత స్థలం ఉన్నవారు ఈ మొత్తంతో ఇల్లు నిర్మించుకోవచ్చు. స్థలం లేని వారికి ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తుంది.

Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!

పథకానికి పరిపాలనా ఆమోదం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇళ్ల నిర్మాణం దశలవారీగా పూర్తయ్యే కొద్దీ బిల్లులు చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు అధికారులు జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.

Capital Of AP : అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు!!

ఇల్లు కట్టుకోవాలనుకునే వారు గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, జాబ్ కార్డు, ఫోటోలు వంటి పత్రాలు అవసరం. త్వరలోనే అర్హుల జాబితాలు విడుదల చేసి, వచ్చే నెలలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

Trump: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఉగ్రరూపం.. భారత్ చైనా పై భారీ సుంకాలు!
Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!
Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!
Praja Vedika: నేడు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →