తేదీ 08-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 08 జనవరి 2026 (గురువారం).
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి.
1.శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి).
2. శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు (ఎంఎల్సీ).
3. శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు (ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్)
తేదీ 06-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు. కార్యక్రమానికి గౌరవనీయ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ బత్తుల తాతయ్యబాబు గారు హాజరయ్యారు. వారు ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విని, పరిష్కారాలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజా వేదిక కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో సక్రమంగా ముగిసింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో కార్యక్రమం విజయవంతమైందని పార్టీ నాయకులు తెలిపారు.