LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!!

WhiteHouse Shooting: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ సెక్యూరిటీ చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక సాయుధ నిందితుడు భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరపగా, సీక్రెట్ సర్వీస్ అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిల…

AndhraPravasi News Desk 2 min read
WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!!

Nri- వాషింగ్టన్‌లో యుద్ధ వాతావరణం: ఒకే నెలలో రెండోసారి.. వైట్ హౌస్ లాక్‌డౌన్!

అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గుళ్ల వర్షం: ప్రాణభయంతో జర్నలిస్టుల పరుగు!

వైట్ హౌస్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం: సామాన్యుడికి తగిలిన బుల్లెట్!

WhiteHouse Shooting: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తీవ్ర కలకలం రేగింది. ఆ దేశ అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్ హౌస్’ భద్రతా తనిఖీ కేంద్రం (చెక్ పోస్ట్) వద్ద శనివారం సాయంత్రం భారీగా కాల్పులు జరిగాయి. ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా వైట్ హౌస్ గేటు సమీపంలోకి దూసుకువచ్చి, భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరపడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. కాల్పుల శబ్దాలు వినపడటంతో వైట్ హౌస్ రక్షణ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సాయంత్రం 6 గంటల సమయంలో ఒక అనుమానిత వ్యక్తి తన బ్యాగ్ నుంచి తుపాకీని బయటకు తీసి అక్కడి సెక్యూరిటీ బూత్‌పై ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారులపైకి కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన వైట్ హౌస్ రక్షణ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా దళాల బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన నిందితుడిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సదరు నిందితుడు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

ఈ రెండు వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల సమయంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుమారు 15 నుండి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న ఒక సాధారణ పౌరుడు (బైస్టాండర్) కూడా బుల్లెట్ గాయాలపాలయ్యాడు. అయితే ఆ వ్యక్తికి నిందితుడు కాల్చిన బుల్లెట్ తగిలిందా, లేక భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డాడా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఈ సంచలన ఘటన జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఓవల్ ఆఫీసులో ఉన్నారు. కాల్పుల శబ్దం వినపడగానే అక్కడ పనిచేస్తున్న అంతర్జాతీయ జర్నలిస్టులు, సిబ్బందిని భద్రతా అధికారులు వెంటనే ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి పంపించి తలుపులు మూసివేశారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే వైట్ హౌస్ కాంప్లెక్స్ మొత్తాన్ని అధికారులు దాదాపు గంటన్నర పాటు పూర్తి లాక్‌డౌన్‌లోకి తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు. సీక్రెట్ సర్వీస్ అధికారులతో కలిసి ఎఫ్‌బీఐ ఈ దాడి వెనుక ఉన్న కారణాలపై ఉమ్మడి దర్యాప్తు ప్రారంభించింది. మరణించిన నిందితుడికి గతంలోనే మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, స్థానిక పోలీసులకు అతడు ముందే పరిచయమున్న వ్యక్తి అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల ఘటనతో వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…