- ఆకాశంలో మంటలు.. నేలకూలిన లోహ విహంగం: కువైట్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం..
- అమెరికా యుద్ధ విమానం కూలడానికి గల కారణాలపై వీడని మిస్టరీ..
Kuwait Updates: పశ్చిమాసియాలో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్లో ఓ అమెరికా యుద్ధ విమానం (US Warplane) కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇరాన్ మీడియా సంస్థ షేర్ చేసింది. కువైట్ గగనతలంలో ఉన్న ఆ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కిందపడింది.
అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఆ జెట్ అమెరికా నుంచి వచ్చిందా..? ఇజ్రాయెల్ పంపిందా..? అనే దానిపై స్పష్టత లేదు.
అంతేకాక కొన్ని కథనాలు ఆ ఫైటర్ జెట్ను F-15గా పేర్కొనగా.. మరికొన్ని F/A-18 కావొచ్చని చెప్తున్నాయి. ఈ రెంటింటినీ తయారుచేసింది అమెరికానే. ఈ ఘటనపై కువైట్ రక్షణశాఖ ప్రకటన చేస్తూ.. పలు యూఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి, వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కూలడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
US F-15 Fighter Jet Downed in Kuwait
— IRNA News Agency ☫ (@IrnaEnglish) March 2, 2026
According to local sources, a US F-15 fighter jet was shot down in the skies above Kuwait earlier on Monday morning. pic.twitter.com/UIyTkZllEX